తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వాయిదా వేయలేని ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవల 10 మంది BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన విషయం బహిరంగంగా వెల్లడైన సంగతి తెలిసిందే.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ఉత్సాహం ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరింది. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఐదు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీడీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం నేడు చోటు చేసుకుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ ముగిసింది. ఈ సమయంలో, నలుగురు ఎమ్మెల్యేలపై క్రాస్ ఎగ్జామినేషన్ జరగగా, తదుపరి దశలో అక్టోబర్ 1న పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల అడ్వకేట్లను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామైన్ చేయనున్నారు.
ప్రకృతిని.. పూలను పూజించే గొప్ప సంస్కృతికి నెలవు తెలంగాణ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని అక్కాచెల్లెళ్లందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడెల్ వాయించినట్టుగా ఉంది సీఎం తీరు.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడెల్ వాయించినట్టుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాకుండా.. రాష్ట్రంలోని అన్ని వర్గాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఉన్న నగరాన్ని ఉద్ధరించే పరిస్థితి లేదని, అయితే ముఖ్యమంత్రి మాత్రం ‘ఫ్యూచర్ సిటీ’ కడతామని […]
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లిలో ప్రేమ వ్యవహారం దారుణానికి దారితీసింది. గ్రామానికి చెందిన డ్రైవర్ ఎదురగట్ల సతీష్ (25)ను, అతని ప్రేమ వ్యవహారం నేపథ్యంలో యువతి కుటుంబ సభ్యులు దారుణంగా హతమార్చారు.
తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనా మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో, పలువురు కీలక అధికారులు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఇప్పటివరకు పనిచేసిన వీసీ సజ్జనార్, తన పదవీకాలంలో చివరి రోజును సాధారణ ప్రజల మాదిరిగానే గడిపారు.
దుబాయ్‌లోని రింగ్ ఆఫ్ ఫైర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఆసియాకప్ ఫైనల్లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. హై ఓల్టేజ్ మ్యాచ్‌లో ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఆసియాకప్ 2025 విజేతగా నిలిచింది.