YouTube Ad Revenue: ఆర్థిక మందగమనంతోపాటు టిక్‌టాక్ నుంచి ఎదురవుతున్న పోటీ ప్రభావం యూట్యూబ్ యాడ్ రెవెన్యూపై పడుతోంది. దీనివల్ల గతేడాదితో పోల్చితే ఈసారి ఆదాయం తగ్గింది. యూట్యూబ్‌తోపాటు మెటా మరియు స్నాప్ సంస్థల రెవెన్యూని టిక్‌టాక్ క్రమంగా తన వైపుకు మళ్లించుకుంటోందంటూ ఇటీవల వచ్చిన వార్తలు దీంతో నిజమైనట్లు మార్కెట్ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూట్యూబ్ గతేడాది మూడో త్రైమాసికంలో 7.2 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందగా ఈ ఏడాది 7.1 బిలియన్ డాలర్ల రెవెన్యూతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
మాతృ సంస్థ ఆల్ఫాబేట్ తన రెవెన్యూని డివిజన్ల వారీగా 2019లోని నాలుగో త్రైమాసికం నుంచి వెల్లడిస్తోంది. అయితే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు యూట్యూబ్ యాడ్ రెవెన్యూ తగ్గిపోవటం ఇదే తొలిసారి. ఇదిలాఉండగా ఇంటర్నెట్ కంపెనీలు ఎక్కువ శాతం తమ ఆదాయ తగ్గుదలకు దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనాన్నే ప్రధాన కారణంగా చూపుతున్నాయి. అడ్వర్టైజర్లు ప్రకటనల ఖర్చులను తగ్గించుకుంటూ ఉండటం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Janhvi Kapoor: బోనీ కపూర్ వలనే శ్రీదేవి చనిపోయిందా.. నిజాలు బయటపెట్టిన జాన్వీ
ఈ నేపథ్యంలోనే యూట్యూబ్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబేట్.. వాల్‌స్ట్రీట్ అంచనాల కన్నా తక్కువ స్థాయిలోనే ఆర్థిక ఫలితాలను (రాబడులను, ఆదాయాలను) ప్రకటించింది. స్టాక్ వ్యాల్యూ కూడా 5 శాతం కన్నా ఎక్కువగా పడిపోయింది. దీంతో యూట్యూబ్ నష్టనివారణ చర్యలను ఎంతో ముందుగానే ప్రారంభించింది. షార్ట్స్ క్రియేటర్స్‌కి యాడ్ రెవెన్యూలో కొంత భాగాన్ని చెల్లిస్తామని గత నెల చివరలో ప్రకటించింది. తద్వారా ట్యాలెండ్ పీపుల్ టిక్‌టాక్ వైపుకు వెళ్లకుండా ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
వీడియో క్రియేటర్స్‌కి చేసే పేమెంట్ల విషయంలో టిక్‌టాక్‌కి ఏమంత మంచి పేరు లేకపోవటం యూట్యూబ్‌కి కలిసి రానుందని అంటున్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే తాము పెట్టుబడులు పెడతామని, అదే సమయంలో ఎకనమిక్ ఎన్విరాన్‌మెంట్ పైనా తమ ఫోకస్ ఉంటుందని ఆల్ఫాబేట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.