ఇంటర్నేషనల్ ఓటీటీ సర్వీసుల కంపెనీ అమెజాన్ ప్రైమ్ వీడియో.. సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఇండియన్ కస్టమర్ల కోసం 599 రూపాయలకే ఏడాది పాటు సబ్‌స్క్రిప్షన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. గతంలో ఈ ఆఫర్ కేవలం ఎయిర్‌టెల్ వినియోగదారులకే ఉండేది. ఇప్పుడు అన్ని టెలికం కంపెనీల కస్టమర్లకు విస్తరించింది. అయితే ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవాళ్లు ఒక వినియోగదారుడు, ఒక స్మార్ట్‌ఫోన్‌లో మాత్రమే ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసులను పొందుతారు.