నిధుల కొరత ఎదుర్కొంటున్న ఎడ్‌టెక్ సంస్థ అన్‌అకాడెమీ.. ఉద్యోగుల తొలగింపునకు తెరతీసింది. మొత్తం స్టాఫ్‌లో పది శాతం మందిని ఇంటికి పంపింది. ఈ సంస్థలో 3,500 మంది పనిచేస్తుండగా అందులో 350 మందిని తొలగించింది. ఖర్చులను తగ్గించుకోవటం ద్వారా లాభాలపై ఫోకస్ పెట్టిన ఈ సంస్థ.. ముందుగా సిబ్బందిని తగ్గించుకునే పనిలో పడింది. ఈ మేరకు అన్‌అకాడెమీ కోఫౌండర్ అండ్ సీఈఓ గౌరవ్ ముంజాల్ ఇంటర్నల్‌గా ఒక నోట్ విడుదల చేశారు.