C.P. Radhakrishnan: విజయవాడ పున్నమి ఘాట్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ – 2025లో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పాల్గొన్నారు. నగర ప్రజల మనసు హత్తుకునేలా ప్రసంగించారు. ప్రారంభంలో అందరికీ “తెలుగు భాషలో నమస్కారం” చెప్పి తన ప్రసంగాన్ని కొనసాగించిన ఉపరాష్ట్రపతి, తెలుగు భాష అందం, సాహిత్యం, సంగీతం వైభవాన్ని ప్రశంసిస్తూ, “అందమైన తెలుగులో పాడిన పాటలు అద్భుతంగా ఉంటాయి. సాహిత్యభరితంగా, సంగీతభరితంగా ఉండటమే తెలుగు భాషను ప్రత్యేకం చేస్తోంది” అని అన్నారు.
Pawan Kalyan: కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారులు ఆందోళన విరమించారు. వచ్చే నెల10వ తేదీన పవన్ కల్యాణ్ వస్తారని కలెక్టర్ క్లారిటీ ఇచ్చారు. ఆ సమావేశంలోపు పరిష్కార మార్గాలుపై అధికారులతో చర్చించనున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారన్నారు. పవన్ వచ్చేంత వరకు ఈ 16 రోజులు తాము వేటకు వెళ్ళమని మత్స్యకారులు తేల్చిచెప్పారు. అప్పటికి డిప్యూటీ సీఎం రాకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.
Karnataka High Court Rejects X (Twitter) Petition: కర్ణాటక హైకోర్టులో ఎక్స్ (గతంలో ట్విట్టర్)కు ఎదురుదెబ్బ తగిలింది. ప్లాట్‌ఫారమ్‌లోని కొన్ని ఖాతాలు, పోస్ట్‌లను బ్లాక్ చేయాలన్న కేంద్రం ఆదేశాలను సవాలు చేస్తూ ఎక్స్(గతంలో ట్వీటర్) దాఖలు చేసిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు బుధవారం కొట్టివేసింది. భారతదేశంలో పనిచేయడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు దేశ చట్టాలను పాటించాలని జస్టిస్ ఎం. నాగప్రసన్న స్పష్టం చేశారు. ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియాను నియంత్రించడం అవసరమని, కంపెనీలు నియంత్రణ లేకుండా పనిచేయడానికి అనుమతించలేమని కోర్టు పేర్కొంది. భారత…
Botsa Satyanarayana: ప్రజారోగ్యం, విద్య ప్రభుత్వం చేతిలో ఉంటేనే న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.. తాజాగా మండలిలో విపక్షనేత మాట్లాడారు. పీపీపీ మోడ్ లో పెట్టిన కళాశాలలు ఫెయిల్ అయ్యాయని.. ప్రభుత్వం ఆధ్వర్యంలో కళాశాలలకు ఉండే బాధ్యత ప్రైవేటీకరణ జరిగితే ఉండవన్నారు. కరోనా లాంటి విపత్తులు సంభవిస్తే స్పెషాలిటీ ఆస్పత్రుల అవసరం ఉంటుందని.. ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు.. వైద్యాన్ని, చదువును డబ్బులతో సభ్యులు కొలవటం సరికాదన్నారు.. ఏ ప్రైవేట్ సంస్థ […]
GST Impact in AP: జీఎస్టీ ప్రభావంతో ఏపీలో వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. కొత్త పన్ను విధానంతో ప్రజలకు ఊరట లభించింది. రోజుకి 4 వేల రిజిస్ట్రేషన్ల దిశగా రాష్ట్రం ముందడుగేస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి స్పందించారు. రాష్ట్రంలో నూతనంగా అమలైన జీఎస్టీ విధానం వాహనాల అమ్మకాలకు ఊతమిచ్చిందని, పన్ను భారం తగ్గడంతో ప్రజలు కొత్త వాహనాల కొనుగోలుకు ముందుకు వస్తున్నారన్నారు రవాణా, యువజన & క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సోమవారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 2,991 వాహనాలు…
Nimmala Ramanaidu: సందర్భం ఏదైనా తెలుగు దేశం పార్టీపై .. పసుపు రంగుపై ఆయనకి ఉన్న అభిమానాన్ని, ఆప్యాయతని వదిలిపెట్టని నాయకుడిగా మారిపోయారు మంత్రి నిమ్మల రామానాయుడు. పార్టీ కార్యక్రమమైన, అసెంబ్లీ సమావేశాలైన నిత్యం పసుపు చొక్కాతో కనిపించే మంత్రి నిమ్మల రామానాయుడు తన కూతురి వివాహ వేడుకలోనూ పసుపు చొక్కాని వదిలిపెట్టలేదు. పాలకొల్లులో ఈరోజు జరిగిన నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజ వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో పాటు ఎంపీలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాయకులు హాజరయ్యారు. ఆ సమయంలోనూ మంత్రి…
Dussehra Lucky Draw: దసరాకు పలు కంపెనీలు తమ ఉత్పత్తులకు గిరాకీ పెంచుకునేందుకు పలు ఆఫర్స్ ప్రకటిస్తాయి. ఇంకా కొన్ని కంపెనీలు లక్కీ డ్రా నిర్వహిస్తూ ఆకర్షణీయమైన బహుమతులను ప్రకటిస్తాయి. అయితే ఓ గ్రామంలో దసరా పండుగను పురస్కరించుకొని అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించారు. రూ.150 కూపన్ తీసుకుంటే పండుగకు ముందు లక్కీ డ్రా తీసి అందులో విజేతలకు ప్రకటించిన బహుమతులను అందజేయాలని నిర్ణయించారు. ఇంతకీ అదిరిపోయే బహుమతులు ఏమిటి..? ఈ లక్కీ డ్రా ఎక్కడ నిర్వహిస్తున్నారు తెలియాలంటే ఇది చూడండి..
MLC Kumbha Ravibabu: దేశ చరిత్రలో ఆరోగ్య శ్రీ ప్రవేశ పెట్టిన ఘనత రాజశేఖర్ రెడ్డిదని వైసీపీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు అన్నారు.. తాజాగా శాసనమండలిలో ఆయన మాట్లాడారు. తండ్రికి తగ్గ తనయుడిగా జగన్ విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు.. ప్రతి పార్లమెంట్లో మల్టీ హాస్పిటల్స్ పెట్టాలని, పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు పెంచడం కోసం ప్రతి నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్‌లు మొదలు పెట్టారన్నారు.. రాష్ట్రంలో అరకొర సీట్లు సరిపోక ఇతర దేశాలకు విద్యార్థులు పోతున్నారని తెలిపారు.. చంద్రబాబు 4సార్లు…
RK Roja: పవన్ కల్యాణ్‌కి రైతు సమస్యలు మహిళల సమస్యలు, విద్యార్థుల సమస్యలు పట్టవని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు.. హరిహర వీరమల్లు, OG సినిమా షూటింగ్ ల కోసం, బెనిఫిట్ షోలు రేట్లు ఎంత పెంచుకుందామని ఆలోచన తప్ప... ప్రజా సమస్యల పట్టవని విమర్శించారు.. ఆయన నియోజకవర్గంలో దళితుల మీద దాడులు జరిగితే స్పందించరన్నారు... పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ లు చేసుకుంటే... రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినట్టు? అని ప్రశ్నించారు. ఈసారి పవన్ కల్యాణ్ కి డిపాజిట్లు కూడా రావంటూ సంచలన…
Pakistan: పాకిస్థాన్ భారీ పేలుడు సంభవించింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ మస్తుంగ్ జిల్లా.. దష్ట్ ప్రాంతంలోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం పేలుడు ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడు కారణంగా రైలులోని బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదం భయాందోళనలు సృష్టించింది. ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. రైలు ఆ దష్ట్ ప్రాంతానికి చేరుకోగానే పేలుడు సంభవించింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఒక కోచ్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. బోగీలు పట్టాలు తప్పినట్లు ప్రమాదానికి […]