Chhindwara Navratri: దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ ఆలయాల్లో అమ్మవారు వివిధ అలంకరణలో దర్శనమిస్తున్నారు. దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఊరూరా ఏర్పాటుచేసిన మండపాల్లో నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. దసరా శరన్నవరాత్రి వేడుకలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తోంది. కాగా.. నవరాత్రుల పవిత్ర సందర్భంగా మధ్యప్రదేశ్ ఛింద్వారా జిల్లా జమునియా గ్రామంలో భక్తులు ఒకవైపు దుర్గామాత పూజల్లో మునిగితేలుతుండగా మరోవైపు గిరిజనులు రావణుడిని ఆరాధిస్తున్నారు. జమునియా గ్రామం నగరానికి కేవలం 16 కిలోమీటర్ల దూరంలోని ట్యాంకి మొహల్లాలో ఈ అపూర్వ దృశ్యం…
MP: మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఒక యువకుడు పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్లి, మధ్యప్రదేశ్ పోలీసు శాఖలో పనిచేస్తున్న తన భార్యపై ఫిర్యాదు చేశాడు. వేధింపులు, వివాహేతర బంధంపై కంప్లైంట్ ఇచ్చాడు. ఆ భర్త తన భార్యకు మంచి చదువును అందించి ఆమె కలలను నెరవేర్చాడు. కానీ ఆ మహాతల్లి నిర్వకం జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది.
Pakistan vs Sri Lanka: 2025 ఆసియా కప్‌లో పాకిస్థాన్ నేడు శ్రీలంకతో తలపడుతుంది. ఇది పాకిస్థాన్‌కు డూ-ఆర్-డై మ్యాచ్. ఈరోజు పాకిస్థాన్ ఓడిపోతే, ఫైనల్‌కు చేరుకోవాలనే ఆశలు అడియాశలుగా మారిపోతాయి. శ్రీలంక కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. రెండు జట్లు తమ తొలి సూపర్ ఫోర్ మ్యాచ్‌లో పరాజయాలను చవిచూశాయి. శ్రీలంక తన తొలి సూపర్ ఫోర్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. మరోవైపు, పాకిస్థాన్ తన సూపర్ ఫోర్ ఓపెనర్‌లో భారత్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది.…
Bangalore Marriage Dispute: కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఒక వింతైన వైవాహిక వివాదం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కేసులో కొత్తగా పెళ్లైన జంటకు సంబంధించినది. ఫస్ట్ నైట్ రోజు తనతో శారీరక సంబంధం పెట్టుకోలేదని భార్య భర్త నుంచి 2 కోట్ల రూపాయల పరిహారం డిమాండ్ చేసింది. వివాహం జరిగి కొన్ని వారాలు గడిచినా.. తన భర్త తనతో లైంగిక సంబంధం పెట్టుకోలేదని భార్య ఆరోపించింది.
Legendary Cricket Umpire Dickie Bird Passes Away: క్రికెట్ ప్రపంచం నుంచి ఓ దిగ్భ్రాంతికరమైన వార్త వెలువడింది. అద్భుతమైన నిర్ణయాలు, నిష్పాక్షిక అంపైరింగ్‌కు పేరుగాంచిన లెజెండరీ అంపైర్ డిక్కీ బర్డ్ 92 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఆయన క్రికెట్ చరిత్రకు అనేక చిరస్మరణీయ క్షణాలను అందించారు.
Mumbai PSI Durga Kharde's assault video: సోషల్ మీడియాలో ఓ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ముంబైలోని ఒక మహిళా పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ (PSI), ఫిర్యాదుదారులకు మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. వాదన సమయంలో సబ్-ఇన్స్పెక్టర్ దుర్గా ఖర్డే తన నేమ్‌ప్లేట్ బ్యాడ్జ్‌ను తీసివేసి ఫిర్యాదుదారుపై విసిరేస్తోంది. ఇదే నా పేరు.. ఏం పీ*టావో పీ*క్కో అనే రీతిలో దౌర్జన్యం చేస్తోంది. బూతులు తిడుతూ.. కొట్టడానికి మీదికి వస్తోంది. ఈ సంఘటన ముంబైలోని వీపీ రోడ్ పోలీస్ స్టేషన్లో…
Vande Bharat Sleeper Trains: దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో వందే భారత్ రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. వీటికి మంచి ఆదరణ లభించడంతో.. వందే భారత్ స్లీపర్స్‌ను తెచ్చేందుకు కేంద్రం రెడీ అయ్యింది.
Shah Rukh Khan: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తన అభిమానులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మైలురాయిని ఎట్టకేలకు సాధించారు. తన "జవాన్" చిత్రానికిగాను 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ఇది షారుఖ్ ఖాన్ తన 33 ఏళ్ల కెరీర్లో పొందిన మొదటి జాతీయ అవార్డు. ఇది అతడి సినీ ప్రయాణంలో ఒక చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుంది. తాజాగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా షారుఖ్ ఖాన్, విక్రాంత్…
Mahindra Scorpio Classic: మహీంద్రా స్కార్పియో భారతీయ కస్టమర్లలో బాగా ప్రాచుర్యం పొందింది. గత కొన్ని సంవత్సరాలుగా స్కార్పియో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌గా మారుతోంది. మీరు కూడా ఈ నంబర్ -1 ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం! నిజానికి.. జీఎస్టీ సంస్కరణలు 2.0 తర్వాత.. కంపెనీ మహీంద్రా స్కార్పియో ధరలను రూ. ₹1.01 లక్షలకు తగ్గించింది. దీనితో పాటు.. ఈ ఎస్‌యూవీపై వేలది రూపాయల విలువైన ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపితే […]
Maruti Suzuki sales: మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి కంపెనీలు సోమవారం నవరాత్రి పండుగను ఘనంగా జరుపుకున్నాయి. కొత్త జీఎస్టీ సంస్కరణ అమల్లోకి రావడంతో రికార్డు అమ్మకాలను నమోదు చేశాయి. భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సోమవారం 25,000 యూనిట్లకు పైగా రిటైల్ అమ్మకాలను నమోదు చేసింది. త్వరలో 30,000 యూనిట్లను దాటే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేసింది. సోమవారం దాదాపు 80,000 కస్టమర్ తమ కార్లను పరిశీలించేందుకు వచ్చారని కంపెనీ తెలిపింది.