India's Biggest Digital Arrest Scam: గత కొన్ని ఏళ్లుగా దేశవ్యాప్తంగా అనేక డిజిటల్ అరెస్టు కేసులు వెలుగులోకి వచ్చాయి. కానీ తాజాగా భారతదేశంలోనే అతిపెద్ద డిజిటల్ అరెస్ట్ కేసు ఢిల్లీలో వెలుగు చూసింది. ఈ కేసు పోలీసులను, దర్యాప్తు సంస్థలను కూడా ఆశ్చర్యపరిచింది. దక్షిణ ఢిల్లీలోని గుల్మోహర్ పార్క్‌లో నివసించే రిటైర్డ్ బ్యాంకర్ నరేష్ మల్హోత్రా దీనికి బలయ్యాడు. ఈ వృద్ధుడిని ఏకంగా నెలకు పైగా అరెస్టు చేశారు. అతడు జీవితాంతం పొదుపు చేసిన 23 కోట్ల రూపాయలు దోచుకున్నారు.
Shocking Incident in Madhya Pradesh: మధ్యప్రదేశ్ ఖాండ్వా జిల్లాలోని ముస్లిం సమాజానికి చెందిన స్మశానవాటికలో సమాధులను తారుమారు చేసిన ఘటన కలకలం రేపింది. సోమవారం ఉదయం, నగరంలోని బడా అవార్లోని పెద్ద స్మశానవాటికలో రెండు సమాధులు తవ్వినట్లు గుర్తించారు.
Alcohol and Weight Gain: మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని మద్యం సీసాపై హెచ్చరిక రాసి ఉంటుంది. ఎలా హానికరమో ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇక తరచూ తాగే వారిలో చాలా మందికి లివర్ సమస్యలు వచ్చి తీవ్రస్థాయికి చేరి మరణించిన కేసులు కూడా ఉన్నాయి. మద్యపానం వల్ల దీర్ఘకాలంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Heart Attack: ఇదివరకు కాలంలో గుండెపోటు కేసులు పెద్దవారిలో మాత్రమే కనిపించేవి. కానీ నేటి ఆధునిక జీవితంలో ఇది యువతను కూడా ప్రభావితం చేస్తోంది. భారతదేశంలోని ప్రతి యువకుడు దీని గురించి ఆందోళన చెందుతున్నారు. మానసిక ఒత్తిడి, అనారోగ్యకర ఫాస్ట్‌ఫుడ్ తినటం పెరగటం, శారీరక శ్రమ లేకపోవటం, వ్యాయామం చేయకపోవటం వంటివి ఇటీవల ఆరోగ్యానికి పెద్ద శత్రువులుగా మారు తున్నాయి.
Billa Ganneru: ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. జీవనశైలి మార్పుల కారణంగా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ రిస్క్ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది డయాబెటిస్తో బాధపడుతున్నారు. తరచూ మూత్రం రావడం, ఎక్కువగా దాహం వేయడం, ఉన్నట్టుండి బరువు కోల్పోవడం, అలసట వంటివి దీని లక్షణాలు. అయితే మనం రోజూ చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు డయాబెటిస్ రిస్క్‌ను పెంచుతాయని వైద్యులు చెబుతున్నారు. అయితే.. మనం ఇప్పుడు షుగర్‌ని…
Foods to Avoid at Night: సగానికి పైగా వ్యాధులకు మూల కారణం తప్పుడు ఆహారపు అలవాట్లు. మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ.. ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్నా, జీర్ణ సమస్యలు వేధిస్తున్నా.. మీరు సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల కావచ్చు. మీ తప్పు టైమ్‌లో పోషకాహారం తీసుకున్నా ప్రయోజనం ఉండదు. కొంతమంది రాత్రి పూట భోజనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.
GST: జీఎస్టీ అమలుకు ముందు భారతదేశ పన్ను వ్యవస్థ ఎలా ఉండేదో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం వెలుగులోకి తెచ్చారు. గతంలో వ్యాపారాలు డజన్ల కొద్దీ పన్నులు చెల్లించి లెక్కలేనన్ని ఫారమ్‌లను పూరించాల్సి వచ్చేదన్నారు. పరిస్థితి చాలా కష్టంగా ఉండేదని తెలిపారు.. కంపెనీలు వస్తువులను విదేశాలకు పంపించి, తిరిగి మన దేశానికే దిగుమతి చేసుకునేవి అని వివరించారు. అయితే.. ప్రధాని మోడీ ఉదహరించిన సంఘటన ఫ్రెంచ్ వార్తాపత్రిక లెస్ ఎకోస్‌లో ప్రచురించబడింది. 2014 నివేదిక ప్రకారం..
PM Modi: జీఎస్టీ సంస్కరణలు 99% వస్తువులను 5% జీఎస్టీ పరిధిలోకి తెచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తాజాగా ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. జీఎస్టీ సంస్కరణ మధ్యతరగతి ప్రజల జీవితాలను మార్చివేసిందన్నారు. పేదలు ఇప్పుడు రెట్టింపు ప్రయోజనాన్ని పొందుతున్నారని.. జీఎస్టీ రేటు తగ్గడం వల్ల కలలు నెరవేరడం సులభం అవుతుందన్నారు. "2024లో గెలిచిన తరువాత జీఎస్టీకి ప్రాధాన్యం ఇచ్చాం. జీఎస్టీ సంస్కరణలపై అన్ని వర్గాలతో మాట్లాడాం. వన్ నేషన్- వన్ టాక్స్ కలను సాకారం చేశాం. అన్ని రంగాల్లో సంస్కరణలు కొనసాగుతూనే…
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త జీఎస్టీ రేట్లు రేపు, సెప్టెంబర్ 22న అమలులోకి వస్తాయి. దానికి ముందు.. మోడీ మాట్లాడుతూ.. నవరాత్రి సందర్భంగా దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబర్ 22వ తేదీ నవరాత్రి మొదటి రోజు అని, ఆ రోజున నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ అమలు చేయబడుతుందని పేర్కొన్నారు. ఇది కేవలం వేడుకలకు సమయం మాత్రమే కాదని, ఆర్థికాభివృద్ధికి, పన్ను సంస్కరణలకు కీలకమైన దశ అని ప్రధాని అన్నారు
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన ప్రసంగం గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎప్పటిలాగే, ప్రధానమంత్రి ఏ అంశాలను ఉద్దేశించి ప్రసంగిస్తారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. GST 2.0 సంస్కరణలు రేపు అమలు కానున్నాయి.