Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్.. ఒకప్పుడు కేవలం వన్డే స్పెషలిస్ట్ అనిపించుకున్న ఈ పేరు, ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లో నిలకడకు నిలువెత్తు రూపంగా మారింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా జట్టును విజయపథంలో నడిపించడమే కాకుండా, ఫినిషర్‌గానూ తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాడు శ్రేయస్. అయితే, ఈ అద్భుత పరివర్తన వెనుక అయ్యర్‌ను కలిచివేసిన అవమానాలు, విమర్శలు ఉన్నాయనేది ఆసక్తికరమైన అంశం. తనపై వచ్చే విమర్శలనే ఇంధనంగా మార్చుకుని తనను తాను నిరూపించడమే తన లక్ష్యమని అయ్యర్ స్పష్టం చేశాడు.
జియో స్టార్ ‘బిలీవ్’ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యర్.. తన మనసులోని మాటలను పంచుకున్నాడు. ముఖ్యంగా షార్ట్ బాల్స్ ఎదుర్కోవడంలో తనకు బలహీనత ఉందన్న విమర్శలపై అతను ఘాటుగా స్పందించాడు. “నీ వల్ల కాదు, ఈ పరిస్థితిలో నువ్వు రాణించలేవు అని ఎవరైనా అంటే నేను అస్సలు తట్టుకోలేను. అత్యున్నత స్థాయిలో ఆడుతున్న ఒక క్రికెటర్‌గా దాన్ని ఏమాత్రం అంగీకరించలేను. అందుకే నన్ను విమర్శించే వారు తప్పు అని నిరూపించాలని బలంగా నిర్ణయించుకున్నాను” అని అయ్యర్ తెలిపాడు. ఆ కసి ఎంతలా ఉందంటే, ప్రపంచ అత్యుత్తమ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన బౌన్సర్‌ను అద్భుతమైన సిక్సర్‌గా మలచి తన విమర్శకుల నోళ్లు మూయించాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరమైనప్పుడు కూడా అయ్యర్ పట్ల కొందరు ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. “గాయం తర్వాత అయ్యర్ మునుపటిలా ఆడలేడు” అన్న మాటలు అతన్ని మరింత ప్రేరేపించాయి. గాయం తర్వాత మన ఆలోచనా విధానం ఎలా ఉంది అనేదే ముఖ్యమని, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, వేటిని విస్మరించాలి అనే విషయంలో తనకు స్పష్టత ఉందని అతను పేర్కొన్నాడు. షార్ట్ బాల్ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రవీణ్ ఆమ్రే, అభిషేక్ నాయర్ వంటి కోచ్‌ల సలహాలు తీసుకుంటూ కఠోరంగా శ్రమించినట్లు తెలిపాడు.
తన ప్రాక్టీస్ సెషన్ల గురించి వివరిస్తూ.. “గతంలో షార్ట్ బాల్ వస్తే సింగిల్ తీయడానికో లేదా డిఫెన్స్ ఆడడానికో ప్రయత్నించేవాడిని. కానీ ఇప్పుడు నా మైండ్‌సెట్ మారింది. నా జోన్‌లోకి షార్ట్ బాల్ వస్తే కచ్చితంగా సిక్సర్ కొట్టాలనే లక్ష్యంతో ఉన్నాను. ప్రాక్టీస్‌లో దాదాపు 300లకు పైగా బంతులను ఎదుర్కొంటాను. సైడ్ ఆర్మ్ త్రోల కంటే కూడా అసలైన బౌలర్లను ఎదుర్కోవడానికే మొగ్గు చూపుతాను. బౌలర్ బంతిని వదిలే ముందే సరైన పొజిషన్‌లోకి రావడం (Rhythm) నేర్చుకున్నాను. ఏబీ డివిలియర్స్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలలో కనిపించే ఆ రిథమ్‌ను నేను కూడా అలవర్చుకున్నాను” అని అయ్యర్ తన నిలకడ వెనుక ఉన్న రహస్యాన్ని వెల్లడించాడు. విమర్శలే తనను మరింత దృఢంగా మార్చాయని, ప్రస్తుత తన ఫామ్‌కు ఆ కసి ఒక కారణమని పంజాబ్ కింగ్స్ సారథి స్పష్టం చేశాడు.
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!