Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crude Oil Prices: పశ్చిమ ఆసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపే దిశగా సాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు సరఫరాకు ఆటంకాలు కలగవచ్చనే ఆందోళనల మధ్య, భారత్ తన విదేశీ మార్పిడి నిల్వలను కాపాడుకోవడానికి ఇప్పటికే బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచింది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం రవాణాకు అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ ప్రాంతంలో అనిశ్చితి నెలకొనడం వల్ల క్రూడాయిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇంధన అవసరాల కోసం 85 శాతం దిగుమతులపైనే ఆధారపడే భారత్‌కు ఇది పెను సవాలుగా మారింది.
ప్రస్తుత పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా స్పందిస్తూ.. ప్రజలు ఇంధన వినియోగాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ మీటింగ్స్, ఈవీ వాహనాల వాడకం, సాధ్యమైన చోట స్కూళ్లకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయాలని సూచించారు. మరోవైపు, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రతిరోజూ దాదాపు రూ.1,000 కోట్ల మేర నష్టాలను చవిచూస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 110 డాలర్లకు చేరుకున్నా, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు చేయకపోవడమే ఇందుకు కారణం. ఈ భారీ నష్టాలను చమురు సంస్థలు ఎంతో కాలం భరించలేవని, త్వరలోనే పెట్రో ధరల పెంపు తప్పకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
Also Read
- SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
- RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
- Explainer: భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి పెరగనున్న ధరలు!
- TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ పరిస్థితిని ఒక “వేక్-అప్ కాల్” (మేల్కొలుపు పిలుపు)గా అభివర్ణించారు. దేశంలో ప్రస్తుతం ఇంధన నిల్వలకు కొరత లేనప్పటికీ, భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లకు ప్రజలు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్ సైతం ఇదే తరహాలో హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమ ఆసియా సంక్షోభం కొనసాగితే భారత్ ఒక “పెద్ద షాక్” ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని, ఇది రూపాయి విలువ పతనం, ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రవాణా ఖర్చులు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు సైతం ఆటోమేటిక్‌గా పెరుగుతాయని, ఈ గ్లోబల్ సంక్షోభం భారత సామాన్యుడి జేబుపై గట్టి ప్రభావం చూపనుందని స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!