Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో డ్వాక్రా మహిళల ఆర్థిక పురోగతి, జీవనోపాధుల విస్తరణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,02,009 ఎస్‌హెచ్‌జీ సంఘాలకు రూ.15,054 కోట్ల బ్యాంకు రుణాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. మిగిలిన రూ.36,000 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా బ్యాంకర్లతో సమన్వయం పెంచుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే.. స్త్రీనిధి ద్వారా ఇప్పటివరకు 4.73 లక్షల మంది మహిళలకు రూ.4,800 కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు.
మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రతి ఎస్‌హెచ్‌జీ మహిళకు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMJJBY, PMSBY) పథకాల ద్వారా వంద శాతం బీమా రక్షణ కల్పించాలని స్పష్టం చేశారు. బ్యాంకు రుణాల ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఛార్జీల మినహాయింపుపై మహిళల్లో విస్తృతమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
మహిళా ఆర్థిక సాధికారతను పెంపొందించే దిశగా వారు తయారు చేసే 65 రకాల నాణ్యమైన ఉత్పత్తుల విక్రయం కోసం ఇప్పటికే నాలుగు ‘స్వయం’ బ్రాండ్ సిగ్నేచర్ స్టోర్లను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జీవనోపాధి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఉపాధి నైపుణ్యాలలో మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మహిళలు స్వయం ఉపాధితో రాణించి, ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!