Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- దిశా సాలియన్ కేసుపై స్పందించిన ఉద్ధవ్ ఠాక్రే..
- ఆదిత్య ఠాక్రే పేరు ప్రస్తావనపై కీలక వ్యాఖ్యలు..
- తమకు ఈ మృతితో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ..
- మోడీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి అంటూ సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Disha Salian Case: దిశా సాలియన్ మృతిపై సీబీఐ విచారణ మహారాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. దివంతగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ ముంబై మలాడ్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ 14వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయారు. కోర్టు ఆదేశాలతో ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. ఇటీవల సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేతో పాటు పలువురు పోలీసులు, అధికారుల పేర్లను కూడా ప్రస్తావించింది.
ఈ కేసుపై ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. ఈ కేసు వెనక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. తనకు, తన కుమారుడికి దిశా సాలియన్ మరణంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దర్యాప్తు పేరుతో వ్యక్తుల ప్రతిష్ట దెబ్బతీయొద్దని సీబీఐని కోరారు. అలా జరిగితే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దిశా సాలియన్ మరణం బాధాకరమని, ఈ ఘటనలోకి మమ్నల్ని ఎందుకు లాగుతున్నారు.? అని ప్రశ్నించారు. మాకు దీనితో ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత చర్య అని ఉద్ధవ్ అన్నారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
దర్యాప్తులోకి సంబంధం లేని వ్యక్తుల పేర్లు కూడా లాగుతున్నారని, ప్రధాని మోడీ, ట్రంప్ పేర్లు కూడా ఇందుకు ఎందుకు లాగకూడదు.? అని వ్యంగ్యంగా స్పందించారు. దర్యాప్తు చేయడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, వ్యక్తిత్వ హననానికి పాల్పడొద్దని అన్నారు.
ఏంటి ఈ కేసు..?
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడిన కొన్ని రోజుల తర్వాత, 2020 జూన్ 8న ముంబైలోని ఓ భవనం పైనుంచి పడి దిశా సాలియన్ మరణించారు. ఈ సమయంలో యాక్సిడెంట్ డెత్ రిపోర్ట్(ఏడీఆర్) నమోదు చేశారు. అయితే, తన కూతురిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడి హత్య చేశారని దిశ తండ్రి సతీష్ సాలియన్ ఆరోపించారు. దీంతో కోర్టు ఈ కేసుపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. ఆదిత్య ఠాక్రే, డినోమోరియా, రియా చక్రవర్తితో పాటు పలువురు పోలీస్, ఫోరెన్సిక్ అధికారుల పేర్లు సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చారు.
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!