పారిస్‌లో ప్రారంభ వేడుకల్లో ఓ తప్పిదం జరిగింది. ఒలింపిక్ క్రీడల నిర్వాహకులు దక్షిణ కొరియా అథ్లెట్లను ఉత్తర కొరియా వాసులుగా పరిచయం చేశారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభోత్సవం సందర్భంగా.. దక్షిణ కొరియా బృందం సెయిన్ నదిలో పడవపై తమ దేశ జెండాను ఎగురవేసింది.
కుమార మంగళం బిర్లా నేతృత్వంలోని ఆదిత్య బిర్లా గ్రూప్ ఇప్పుడు పెయింట్ తర్వాత ఆభరణాల మార్కెట్లోకి వచ్చింది. గ్రూప్ శుక్రవారం తన ఆభరణాల బ్రాండ్ ఇంద్రీయను ప్రారంభించింది.
చైనాకు చెందిన జే-31 యుద్ధ విమానం ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటి వరకు కేవలం టెస్టింగ్ కోసమే ఎగురుతున్న ఈ ఫైటర్ ప్లేన్ ఫోటోలు సోషల్ మీడియాలో విరివిగా షేర్ అవుతున్నాయి.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తొలి వ్యోమగామిని పంపేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో వెల్లడించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కి చెందిన గగన్యాత్రి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) ప్రయాణిస్తుందని ఆయన తెలియజేశారు.
విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు ఆందోళన కలిగించే వార్త వెలుగులోకి వచ్చింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రకారం.. గత ఐదేళ్లలో 41 దేశాల్లో కనీసం 633 మంది భారతీయ విద్యార్థులు మరణించారు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు శుభవార్త వెలువడింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత స్టార్ షూటర్ మను భాకర్ ఫైనల్‌కు చేరుకుంది. అంతకుముందు.. ఈ ఈవెంట్లో భారత పురుషుల ఆటగాళ్లు క్వాలిఫయర్లకు మించి పురోగతి సాధించలేదు.
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంత్‌నాగ్ జిల్లా సమీపంలోని సింథాన్-కోకెర్నాగ్ రహదారిపై వాహనం కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు సహా ఎనిమిది మంది మృతి చెందారు.
మహిళలు.. ఇంటికే పరిమితం కాదని మరోసారి నిరూపితమైంది. ఓ మహిళ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తూ.. ఎమ్మెల్యేగా గెలుపొందింది. అంతే కాదు.. ఆమె క్రీడాకారిణి కూడా.