రాజస్థాన్‌లోని మనోహర్పూర్ ప్లాజాలో ధర కంటే ఎక్కువ టోల్ ట్యాక్స్ వసూలు చేశారన్న ఆరోపణలపై కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. రూ.1900 కోట్లతో నిర్మించిన రోడ్డుపై రూ.8000 కోట్ల టోల్ ట్యాక్స్ ఎందుకు వసూలు చేశారో, ఎలా వసూలు చేశారో ఓ న్యూస్ ఛానెల్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సవివరంగా వివరించారు.
'ఒకే దేశం-ఒకే ఎన్నికలు' ప్రతిపాదనకు మోడీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ తన నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2028 నాటికి భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఈ మేరుక ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ గతంలో కూడా వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఇస్రోకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఇందులో చంద్రయాన్-4, వీనస్ మిషన్, ఇండియన్ స్పేస్ స్టేషన్, తదుపరి తరం ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేయడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి.
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై యావత్ ప్రపంచం దృష్టి సారిస్తోంది. ఈ యుద్ధం చాలా ఆందోళనలను కలిగించింది. అయితే తాజాగా రష్యాలో తీసుకున్న మరో నిర్ణయం సంచలనంగా మారింది.
వన్ నేషన్, వన్ ఎలక్షన్‌కి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టనున్నారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే దిశగా కేంద్ర మంత్రివర్గం ఈరోజు భేటీ అయింది.
అమ్మకాలు క్షీణించడం, పెరుగుతున్న పోటీ కారణంగా అమెరికాకు చెందిన కిచెన్వేర్ కంపెనీ టప్పర్‌వేర్ బ్రాండ్స్ కార్ప్ దాని అనుబంధ కంపెనీలు దివాలా పిటిషన్ దాఖలు చేశాయి.
రాజస్థాన్‌లోని భిల్వారాలో మత ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇక్కడ మంగళవారం గణేష్ నిమజ్జనం అనంతరం బుధవారం ఉదయం ఖాళీ మండపంలో జంతువుల అవశేషాలు కనిపించడంతో కలకలం రేగింది.
మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. మియాపూర్ బస్సు బాడీ బిల్డింగ్ దగ్గర చెట్టుకు ఉరి వేసుకొని రహీం(32) అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.