పశ్చిమాఫ్రికాలోని గినియాలో జరుగుతున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ అభిమానులు తమలో తాము ఘర్షణ పడ్డారు. ఇందులో 100 మందికి పైగా మరణించారు. గినియాలోని రెండవ అతిపెద్ద నగరమైన జెరెకొరె నగరంలో ఆదివారం జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా అభిమానుల మధ్య జరిగిన ఘర్షణల్లో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారని స్థానిక ఆసుపత్రి వర్గాలు వార్తా సంస్థ ఏఎఫ్‌పీ కి తెలిపాయి. ఈ ఘటనపై ఓ వైద్యుడు మాట్లాడుతూ.. “కంటి చూపు మేర మృతదేహాలు పడి ఉన్నాయి. ఆసుపత్రిలో మృతదేహాల క్యూలు భారీ కనిపించింది. స్థలం సరిపోక కొన్ని శవాలను కారిడార్‌లలో నేలపై ఉంచారు. మార్చరీ నిండిపోయింది. ” అని పేర్కొన్నారు.
READ MORE: Attack on Constable: మహిళా కానిస్టేబుల్‌ను చితకబాదిన యువకుడు.. కింద పడేసి మరీ.. (వీడియో)
2021 తిరుగుబాటులో అధికారాన్ని చేజిక్కించుకుని తనను తాను అధ్యక్షుడిగా నియమించుకున్న గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థం దేశంలోని రెండో అతిపెద్ద నగరం జెరెకొరె నగరంలో ఓ టోర్నమెంట్ నిర్వహించారు. రెఫరీ తీసుకున్న నిర్ణయం వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడి అనంతరం అభిమానులు స్టేడియం బటకు వచ్చి దాడులకు పాల్పడ్డారు. పలు పోలీస్ స్టేషన్‌లను నిప్పు పెట్టారు. రోడ్లపై కూడా మృతదేహాలు పడి ఉన్నాయి. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
READ MORE:SI Suicide: వాజేడు ఎస్ఐ హరీష్ సూసైడ్.. మావోయిస్టుల ఎన్కౌంటర్ తర్వాత రోజే ఘటన
⚠️🔞 WARNING: GRAPHIC 18+ 🔞⚠️
❗️🇬🇳 – At least 100 people lost their lives in violent clashes between rival fans during a football match in N'zerekore, Guinea.
This tragic event, which occurred at the end of a game, resulted in hundreds of fatalities. Medical sources confirmed… pic.twitter.com/xV3COoViUE
— 🔥🗞The Informant (@theinformant_x) December 2, 2024