India-EU Deal: నేడు (జనవరి 27) భారత చరిత్రలో ప్రత్యేకంగా గుర్తుండిపోయే రోజు. అమెరికా నిద్రను దూరం చేసే ఒప్పందం జరిగిన రోజు. ఎందుకంటే నేడు భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద వాణిజ్య ఒప్పందానికి తుది ముద్ర పడింది. యూరోపియన్ యూనియన్‌కు చెందిన 27 దేశాలతో భారత్ ఒకేసారి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిని భారత్ చరిత్రలోనే అతిపెద్ద వాణిజ్య ఒప్పందంగా పేర్కొన్నారు. ఇది కేవలం వ్యాపార ఒప్పందం మాత్రమే కాదని, రెండు ప్రాంతాల కలిసి ఎదుగుదలకు ఇది ఒక స్పష్టమైన దారి చూపించే బ్లూ ప్రింట్ అని చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా భారత్, యూరోపియన్ యూనియన్ కలిసి సముద్ర భద్రత, సైబర్ సెక్యూరిటీ, ఉగ్రవాదం వంటి కీలక అంశాల్లో కలిసి పనిచేయనున్నాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సహకారం మరింత బలపడనుంది. రక్షణ రంగంలోనూ ఉమ్మడి అభివృద్ధికి కొత్త అవకాశాలు వెతకనున్నట్లు ప్రధాని తెలిపారు. దాదాపు 18 సంవత్సరాలుగా సాగిన చర్చల అనంతరం చివరకు ఈ ఒప్పందం సాధ్యమైంది. ఈ ఒప్పందంతో భారత ఆర్థికంగా మెరుగుపడనుంది!
READ MORE: UGC Protests: యూజీసీ కొత్త నిబంధనలపై నిరసనలు.. అసలేం జరిగిందంటే..!
యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోడీతో కలిసి ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఆంటోనియో కోస్టాను “లిస్బన్ గాంధీ”గా పిలుస్తారని ప్రధాని చెప్పడం ఈ సమావేశానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ భేటీ తర్వాత సంయుక్తంగా ప్రెస్ సమావేశం నిర్వహించి, ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం.. యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చే చాలా ఉత్పత్తులపై భారత్ ట్యాక్సులను తగ్గించనుంది. రసాయన ఉత్పత్తుల్లో దాదాపు అన్నింటిపై టారిఫ్ పూర్తిగా తొలగించనున్నారు. మెడికల్, సర్జికల్ పరికరాల్లో 90 శాతం ఉత్పత్తులపై ఇక ట్యాక్స్ ఉండదు. దీని వల్ల చికిత్సకు ఉపయోగించే యంత్రాలు, పరీక్షల పరికరాలు మరింత చౌకగా అందుబాటులోకి రానున్నాయి. సాధారణ వినియోగదారులకు పెద్ద మార్పు మద్యం, బీర్, వైన్ విషయంలో కనిపించనుంది. యూరోపియన్ వైన్‌పై ఉన్న భారీ ట్యాక్స్‌ను శాతానికి తగ్గించారు. స్పిరిట్స్‌పై ట్యాక్స్ 40 శాతానికి, బీర్‌పై ట్యాక్స్ 50 శాతానికి తగ్గనుంది. అలాగే ఆలివ్ ఆయిల్, మార్జరిన్, వెజిటబుల్ ఆయిల్ వంటి తినుబండారాలపై ట్యాక్స్ పూర్తిగా తొలగించనున్నారు. మిషినరీ, పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తులపై భారీ ఉపశమనం లభించింది. ఇప్పటివరకు మిషినరీపై 44 శాతం వరకు, రసాయనాలపై 22 శాతం వరకు, ఔషధాలపై 11 శాతం వరకు ఉన్న ట్యాక్స్ ఇప్పుడు గణనీయంగా తగ్గనుంది. విమానాలు, అంతరిక్ష రంగానికి చెందిన దాదాపు అన్ని యూరోపియన్ ఉత్పత్తులపై కూడా ట్యాక్స్ తొలగించనున్నారు.
READ MORE: Ileana: ఇలియానాపై సౌత్ ఇండస్ట్రీ బ్యాన్? 40 లక్షల అడ్వాన్స్ వివాదం వెనుక అసలు నిజాలివే!
కార్ల విషయంలో ట్యాక్స్‌ను దశలవారీగా 10 శాతం వరకు తగ్గించనున్నారు. అయితే సంవత్సరానికి 2.5 లక్షల కార్ల దిగుమతులకే పరిమితి పెట్టారు. సేవల రంగంలో యూరోపియన్ కంపెనీలకు భారత్‌లో సులభంగా ప్రవేశం కల్పించనున్నారు. బ్యాంకింగ్, షిప్పింగ్, సముద్ర సేవలు మరింత చౌకగా, సులభంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ ఒప్పందం వల్ల యూరోపియన్ యూనియన్‌కు ప్రతి సంవత్సరం సుమారు 4 బిలియన్ యూరోల మేర డ్యూటీ ఆదా అవుతుందని అంచనా. 2032 నాటికి భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్యం రెండింతలు అవుతుందని భావిస్తున్నారు. అదనంగా వచ్చే రెండేళ్లలో యూరోపియన్ యూనియన్ భారత్‌కు 500 మిలియన్ యూరోలు ఆర్థిక సహాయం అందించనుంది. ఇది గ్రీన్ హౌస్ వాయువుల తగ్గింపు, గ్రీన్ టెక్నాలజీ, శుభ్రమైన ఇంధన రంగాలకు ఉపయోగపడనుంది. ప్రపంచ జీడీపీలో దాదాపు 25 శాతం వాటా ఉన్న ఈ రెండు ఆర్థిక శక్తుల మధ్య జరిగిన ఈ ఒప్పందాన్ని ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా పిలుస్తున్నారు. ఇది భారత్‌కు మాత్రమే కాదు, రాబోయే తరాలకు కూడా కొత్త అవకాశాలు తీసుకొచ్చే చారిత్రాత్మక అడుగుగా మారనుంది.