కింగ్ నాగార్జున బుక్‌మై షోలో ‘తల’ సినిమా మొదటి టికెట్ కొనుగోలు చేశాడు. అనంతరం సినిమా యూనిట్‌కి ఆల్ ద బెస్ట్ చెప్పాడు. వాస్తవానికి ‘తల’ చిత్రాన్ని దీపా ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీనివాస్ గౌడ్ నిర్మాతగా అమ్మ రాజశేఖర్ దర్శకత్వంతో రూపొందించారు. ఈ సిమాతో అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ ఈ హీరోగా ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు. ఇందులో అంకిత నస్కర్ హీరోయిన్ నటించింది. రోహిత్, ఎస్తేర్ నోరన్హ, ముక్కు అవినాష్, సత్యం రాజేష్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ కీలక పాత్రల్లో నటించారు. శ్యామ్ కే నాయుడు సినిమా టోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ధర్మతేజ సంగీత దర్శకుడు. ప్రమోషనల్ కంటెంట్ చూసిన వాళ్లంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా రేపు (ఫిబ్రవరి 14)న విడుదల కానుంది.
READ MORE: APSRTC: ఏపీఎస్ఆర్టీసీ ఎండికి ఎంప్లాయిస్ యూనియన్ లేఖ..
తాజాగా సినిమా ట్రైలర్ ను చూసిన కింగ్ నాగార్జున టీంను మెచ్చుకున్నాడు. అంతే కాకుండా ఈ సినిమా మొదటి టికెట్‌ను బుక్ మై షోలో కొన్నాడు. రాగిన్ రాజ్ పెద్ద హీరో కావాలని ఆశీర్వదించాడు. అమ్మ రాజశేఖర్ డైరెక్షన్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని కితాబునిచ్చాడు. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించాడు. నాగార్జున మొదట టికెట్ కొనడంపై దర్శకుడు అమ్మ రాజశేఖర్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సినిమా సాధించబోతోందని దానికి ఇదే వియానికి చిహ్నం అని తెలిపాడు.
READ MORE: Vallabhaneni Vamsi Arrest: వల్లభనేని వంశీ అరెస్ట్.. తదుపరి చర్యలపై మాజీ ఏఏజీ పొన్నవోలు సమాలోచనలు..