సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ మెట్రో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీటైం ఆన్ మై మెట్రో క్యాంపెన్ ప్రారంభమైంది. నేటి నుంచి(8,9,10) మూడు రోజుల పాటు మీటైం ఆన్ మై మెట్రో క్యాంపెన్ పేరిట కోఠి ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డితో పాటు ఇతర మెట్రో ఉన్నతాధికారులు, సీనియర్ ఇంజనీర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి మాట్లాడారు.
READ MORE: Prabhas New Look: న్యూ లుక్‌లో ప్రభాస్.. ఆ దర్శకుడి కోసమా?
హైదరాబాద్ మెట్రో ఇంజనీరింగ్ అద్భుతం చేసిందని హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి అన్నారు. మెట్రోలను రైల్వే ఇంజనీర్లు ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్టుగా చేపడతారని…. తాము హైదరాబాద్ మెట్రోను కేవలం ట్రాన్స్‌పోర్ట్ మోడ్ మాత్రమే కాకుండా నగరం ఆత్మ ప్రతిబింబించేలా నిర్మించామన్నారు. 2013లో ప్రపంచంలోని టాప్ 100 ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో ఒకదానిలో మెట్రో రైల్ నిలిచిందన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న 90 లక్షల వాహనాలు రోడ్లపైకి వస్తే రోడ్లన్నీ జామ్ అవుతాయని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం మాత్రమే ఉపయోగపడుతుందని వెల్లడించారు.
READ MORE: ACB : ముందు మీరు విచారణకు రండి.. తర్వాత చెప్తాం.. కేటీఆర్‌కు ఏసీబీ సెకండ్ నోటీసు
మెట్రో లాంటి వ్యవస్థలు ఇందులో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఎన్‌వీఎస్ రెడ్డి వెల్లడించారు. మెట్రో రైలు జర్నీని ప్రయాణికులు ఎంజాయ్ చేస్తున్నారన్నారు. ప్రయాణికుల టాలెంట్‌ను చూపించేందుకు మీ టైం ఆన్ మై మెట్రో కాంపియన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెట్రో స్టేషన్లలో టాలెంట్ చూపించేలా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. మెట్రో స్టేషన్లలో టాలెంటును షో కేస్ చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తామన్నారు. డాన్సులు, సంగీతం వంటి అంశాలు మీరు ప్రదర్శించవచ్చని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి విజనరీ లీడర్ మెట్రో ప్రాజెక్టు పై ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారని గుర్తు చేశారు. “ప్రపంచ దేశాలకు ధీటుగా హైదరాబాద్ మెట్రో విస్తరణ చేయాలని సీఎం అన్నారు. హైదరాబాద్‌ను విశ్వ నగరాన్ని చేయడానికి మెట్రో కీలక పాత్ర పోషిస్తుంది.. 50,60 ఎకరాల్లో మంచి హబ్‌ను ఏర్పాటు చేసి మెట్రోను డెవలప్ చేయలన్నారు సీఎం.. కేంద్రం దృష్టికి మెట్రో విస్తరణ పై సీఎం అనేక అంశాలను తీసుకెళ్లారు.. మెట్రో తో పాటు హైద్రాబాద్ అభివృద్ధి ప్రపోజల్స్ ను కేంద్రం ముందు ఉంచారు..” అని ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు.