ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈడీ విచారణకు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్ రెడ్డి హాజరయ్యారు. అనుమతులు లేకుండా 55 కోట్ల రూపాయలు ఎఫ్‌ఈఓకి ఎలా బదిలీ చేశారని ఈడీ ప్రశ్నించింది. “అరవింద్ కుమార్ ఆదేశాలతో ఎఫ్ఈఓకి డబ్బులు బదిలీ చేశాం. తమకున్న పరిధిలోనే డబ్బులను బదిలీ చేశాం. పై అధికారి అనుమతి తీసుకొని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా డబ్బులు బదిలీ చేశాం. 46 కోట్ల రూపాయలను విదేశీ మారక దవ్యం రూపంలో చెల్లించాం. రెండవ దఫా రేసింగ్‌కు ఆటంకం లేకుండా ఉండేందుకే చెల్లించాం. రెండవ దఫా రేసింగ్‌కు అడ్వాన్స్ చెల్లించకపోతే రద్దయ్యే అవకాశం ఉంది. రేసింగ్ సక్రమంగా నిర్వహించాలని ఉద్దేశంతో డబ్బులు చెల్లించాం. ఏఎస్ నెక్స్ట్ మొదటి దఫా రేసింగ్ నిర్వహించి భాగస్వామ్యం నుంచి తప్పుకుంది. కంపెనీ తప్పుకోవడంతో హెచ్ఎండీఏ డబ్బులు చెల్లించింది.” అని బిఎల్‌ఎన్ రెడ్డి విచారణలో తెలిపారు.
READ MORE: BJP: ప్రియాంక గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమేష్ బిధూరిపై బీజేపీ సీరియస్..
ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో హైకోర్టు తీర్పుతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. హరీష్ రావు, కేటీఆర్ తెలంగాణ భవన్‌కు వచ్చారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ డైరీ ఆవిష్కరణ చేయనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు,బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. అనంతరం ఈ అంశంపై మరోసారి చర్చించే అవకాశం ఉంది.
READ MORE: Renu Desai : 1000 వర్డ్స్’ క్లైమాక్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్న రేణూ దేశాయ్