జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు, వాహనదారులు గంటల తరబడి వేచి ఉండకుండా త్వరగా తమ గమ్యస్థానాలను చేరేందుకు ఫాస్ట్ ట్యాగ్ ప్రవేశ పెట్టారు. ఈ ఫాస్ట్ ట్యాగ్ (FASTag) విధానంతో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ విధానాన్ని కూడా ప్రోత్సహించబడుతుంది. కాగా.. ఫాస్ట్ ట్యాగ్ లో కొత్త రూల్స్ వచ్చాయి. ఫిబ్రవరి 17 నుంచి ఈ నియమాలు అమల్లోకి రానున్నాయి. వాస్తవానికి, ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ ధ్రువీకరణకు సంబంధించిన నియమాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అమలు చేస్తోంది. నూతన నియమాలకు తెలుసుకోకపోతే అదనపు ఛార్జీలు కట్టాల్సి వస్తుంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
READ MORE: Pankaj Tripathi : అందుకే బాలీవుడ్ విఫలం అవుతుంది..‘మీర్జాపూర్’ నటుడు సంచలన వ్యాఖ్యలు
టోల్ ప్లాజాకు చేరుకున్నప్పుడు ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్‌లిస్ట్‌లో ఉండకూడదు. లావాదేవీ రిజెక్ట్ అయితే.. రెట్టింపు టోల్ చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా.. టోల్ ప్లాజాకు చేరుకోవడానికి ముందు 60 నిమిషాల కంటే ఎక్కువ కాలం ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్‌లిస్ట్‌లో ఉంటే.. అది తెలిసి కూడా10 నిమిషాల పాటు బ్లాక్‌లిస్ట్‌లోనే కొనసాగితే పేమెంట్ రిజెక్ట్ అవుతుంది. అందుకే ఎప్పటికప్పుడు మీ ఫాస్ట్‌ట్యాగ్‌ను చెక్ చేస్తూ ఉండండి.. ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్‌లిస్ట్‌లో చేరడానికి 60 నిమిషాల ముందు లేదా టోల్ దగ్గర స్కాన్ చేసిన 10 నిమిషాలలోపు (మొత్తం 70 నిమిషాల్లో) రీఛార్జ్ చేసుకోవాలి. ఇలా చేస్తే లావాదేవీలు సక్సెస్ అవుతాయి. అదనపు భారం ఉండదు. ఇదొక్కటే కాదు… కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేయకపోవడం, ఛాసిస్ నంబర్‌కు, వెహికల్ నంబర్‌కు మధ్య తేడా ఉన్నా.. ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్‌లోకి వెళ్తుంది. దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
READ MORE: Home Minister Anitha: వల్లభనేని వంశీ అరెస్ట్ అక్రమం కాదు.. సక్రమమే!
ఈ అంశంపై చాలా మందికి క్లారిటీ రావడం లేదు. అందుకే ఉదాహరణతో తెలుసుకుందాం.. మధ్యాహ్నం1 గంటలకు మీ ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్‌లోకి వెళ్లింది అనుకుందాం.. మీరు 2.30 గంటలకు టోల్‌ప్లాజాకు చేరుకున్నారు. మీ ట్రాన్సాక్షన్ రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ దాదాపు గంటన్నర సమయం పట్టింది. అయితే.. 70 నిమిషాల్లోగా బ్లాక్‌లిస్ట్‌కు సంబంధించిన వివరాలు మీరు చూసుకొని.. దాన్ని సరి చేసి.. కేవైసీని పూర్తి చేయడం చేస్తే లావాదేవీలో ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. ఇదొక్కటే కాదు.. మీ టోల్ రీడ్ పూర్తైంది అనుకుందాం.. 10 నిమిషాల తర్వాత మళ్లీ బ్లాక్‌లిస్ట్‌లోకి వెళ్తే ఆ లావాదేవీ తిరస్కరించబడుతుంది. అందుకే ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ముందుగానే రిఛార్జ్ చేసుకోవడం మంచిది.