విక్కీ కౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ‘ఛావా’ ఈరోజు థియేటర్లలో విడుదలైంది. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించారు. విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషించారు. కాగా, రష్మిక మందన్న సంభాజీ భార్య యేసుబాయి పాత్రలో నటించింది. ఈ సినిమా హిందీలో విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందు రష్మిక ఓ మీడియా సంస్థతో మాట్లాడింది. కీలక విషయాలు పంచుకుంది.
READ MORE: Shashi Tharoor: మోడీ-ట్రంప్ భేటీపై కాంగ్రెస్ ఎంపీ ప్రశంసలు.. హుందాగా ఉందని కితాబు
“నేను దేను దేనికి కూడా సీరియస్‌గా తీసుకోను.. నిజాయితీగా పని చేస్తాను. సినిమా ఒప్పుకునే ముందు నేను కథకు ప్రాధాన్యమిస్తాను. కథ బాగుంటే ఏ పాత్ర చేయడానికి కైనా నేను రెడీ.. నలుగురు పిల్లల తల్లిగా అయినా.. బామ్మ పాత్రను కూడా పోషించేందుకు సిద్ధంగా ఉన్నాను. నాకు కథన నచ్చితే ఎలాంటి విషయాలు పట్టించుకోను. ఎలాంటి పట్టింపులు లేకుండా.. కథలో భాగమయ్యేలా ప్రయత్నిస్తాను. నేను చాలా సినిమాలు చేశాను. ఆ సినిమాల విజయం వెనుక.. ఎలాంటి ప్రణాళికలు పెట్టుకోను. ప్రేక్షకాదారణ పొందడాన్ని అదృష్టంగా భావిస్తాను. అలాంటి మంచి కథల్లో భాగస్వామ్యం కావడం నా అదృష్టం.. నేను నటించిన పాత్రలను ప్రేక్షకులు ఆదరిస్తుండటం నాకు ఆనందాన్ని కలిగిస్తోంది.” అని రష్మిక పేర్కొంది.
READ MORE: Top Headlines @5PM: టాప్ న్యూస్!