విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఛావా’ ఈరోజు థియేటర్లలో విడుదలైంది. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించారు. విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషించారు. కాగా, రష్మిక మందన్న సంభాజీ భార్య యేసుబాయి పాత్రలో నటించింది. ఈ సినిమా హిందీలో విడుదలైంది. విక్కీ చిత్రానికి ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వస్తోంది. చాలా మంది ప్రేక్షకులు ఇది ఒక భావోద్వేగ కథ అని అంటున్నారు. మొదటి రోజు ‘ఛావా’ సినిమా చూసిన ప్రేక్షకులు కంటతడి పెట్టామని చెబుతున్నారు.
READ MORE: kishan Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే.. కాంగ్రెస్ అరాచకాలను ఎండగడతాం
ఒక ప్రేక్షకుడు జాతీయ మీడియా సంస్థతో మాట్లాడాడు. ” ‘ఛావా’ సినిమా చూసి ఏడుస్తూ తిరిగి వస్తున్నా. ఎంత రాతి హృదయం ఉన్నవాడైనా ఈ సినిమా చూసి ఏడుస్తాడు. చివరి 15 నిమిషాలు చాలా బాధాకరంగా ఉంది. చాలా భావోద్వేగ సన్నివేశాలు ఉన్నాయి. విక్కీ కౌశల్ ఒక బెంచ్‌మార్క్‌ను నిర్దేశించాడు. శంభాజీ మహారాజ్ పాత్రకు న్యాయం చేశాడు. ఇంతకు ముందు ఎవరూ ఇంత అద్భుతంగా ఈ పాత్రను పోషించలేదు.” అని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
READ MORE: Se*xual Harassment: పోర్న్ వీడియోలో ఉన్నట్లు చేయాలని భార్యకు వేధింపులు.. వివాహిత సూసైడ్
రష్మిక మందన్న పాత్ర గురించి ప్రేక్షకులు ఆమె టోన్ సినిమాకి సరిపోలేదని అన్నారు. “ఈ సినిమాలో విక్కీని చూస్తే.. అతను విక్కీ కౌశల్ లాగా నాకు కనిపించలేదు. శంభాజీ మహారాజ్ లాగే ఉన్నాడు. రష్మిక మందన్న పాత్ర కొంచెం బలహీనంగా ఉంది. ఆమె చాలా అందంగా కనిపిస్తుంది. కానీ ఆమె స్వరంలో దక్షిణ భారత శైలి స్పష్టంగా కనిపించింది.” అని ఓ ప్రేక్షకుడు అన్నాడు.
READ MORE: Stock Market: ట్రంప్ ఎఫెక్ట్.. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
“విక్కీ కౌశల్ నటన ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. విక్కీ, రష్మిక మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. అశుతోష్ రాణా, దివ్య దత్తా, అక్షయ్ ఖన్నా అందరికీ చాలా మంచి పాత్రలు వచ్చాయి. అక్షయ్ ఖన్నా ఆ పాత్రను చాలా బాగా పోషించాడు. ఈ సినిమాను ఎవ్వరూ మిస్ అవ్వొద్దు. విక్కీ ఆ పాత్రలో నటించలేదు. జీవించాడు. నటన తీరు చూస్తే.. జాతీయ అవార్డు ఇవ్వాల్సిందే.” అని ఓ ప్రేక్షకుడు తెలిపాడు.