హర్షవర్ధన్ రాణే, పాకిస్థానీ నటి మావ్రా హొకేన్ జంటగా నటించిన ‘సనమ్ తేరి కసమ్’ చిత్రం 2016లో విడుదలైంది. ఆ సమయంలో ఈ ప్రేమకథా చిత్రం ప్రత్యేక గుర్తింపును పొందింది. ఆ చిత్రంలోని పాటలు కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఇటీవల ఈ సినిమా మళ్ళీ విడుదలైంది. హిందీలో రీ-రిలీజ్ తర్వాత ‘సనమ్ తేరి కసమ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తోంది.
READ MORE: Chintamaneni: సీఎం చంద్రబాబుతో చింతమనేని భేటీ.. తాజా పరిణామాలపై కీలక చర్చ
‘సనమ్ తేరి కసమ్’ సినిమా కథ గురించి మాట్లాడుకుంటే.. ఇది ఒక ప్రేమకథా చిత్రం. ఇది ఇందర్, సరత్వతి (సరు) కథ. పాకిస్థానీ నటి మావ్రా “సరస్వతి” పాత్రలో నటించగా.. ఇందర్ పాత్రను హర్షవర్ధన్ రాణే పోషించాడు. సినిమా చివర్లో సరు అనారోగ్యం కారణంగా మరణిస్తుంది. ఇందర్.. సరు జ్ఞాపకాలతో తన జీవితాన్ని గడుపుతాడు. ఈ కథను సినిమాలో చాలా భావోద్వేగభరితంగా చూపించారు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల కళ్ళు చెమ్మగిల్లుతాయి.
READ MORE: Chhaava Review : విక్కీ కౌశల్ – రష్మిక’ల చావా రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
రాధిక రావు, వినయ్ సప్రూ దర్శకత్వంలో రూపొందిన ‘సనమ్ తేరి కసమ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఫిబ్రవరి 07న విడుదలైన తొలి రోజున ఈ చిత్రం రూ. 5.14 కోట్లు వసూలు చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అదే రోజు అంటే ఫిబ్రవరి 7న, రెండు బాలీవుడ్ సినిమాలు విడుదలయ్యాయి. కానీ ‘సనమ్ తేరి కసమ్’ ఆ రెండింటినీ వెనుకకు నెట్టింది. ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రేమికుల రోజు సందర్భంగా.. ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నారు.