KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KJQ Pre Release Event: తెలుగు క్రైమ్ డ్రామా ‘KJQ’ (కింగ్ జాకీ క్వీన్) 1990ల కాలం నాటి నేపథ్యంలో సాగే ఒక పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రానికి కిరణ్ కుమార్ (KK) దర్శకత్వం వహించగా, ప్రధాన పాత్రల్లో ‘దసరా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి, నూతన నటుడు శశి ఓదెల, యుక్తి తరేజా నటించారు. వీరితో పాటు పృథ్వీరాజ్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషించారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా 2026 ఆగస్టు 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా కేజేక్యూ (KJQ) ప్రీ రిలీజ్ ఈవెంట్ సినీ అభిమానులకు వరుస అప్డేట్లతో ఆకట్టుకుంది. హోటల్ అవాసలో ఈరోజు జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘ఫౌజీ’ రిలీజ్‌పై నిర్మాత మైత్రి రవి కీలక ప్రకటన చేయగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ టీజర్‌పై అంచనాలను మరింత పెంచేశారు.
స్టేజ్ మీద ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో సాగుతోందని వెల్లడించిన మైత్రి రవి డిసెంబర్ 2న ప్రీమియర్స్‌తో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ప్రభాస్ అభిమానుల్లో మాత్రం భారీ ఉత్సాహం నింపుతోంది. అంతేకాదు ఈ కార్యక్రమంలో మాట్లాడిన శ్రీకాంత్ ఓదెల, ఇటీవలి కాలంలో యావరేజ్, ఏబోవ్ యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి ఆదరిస్తున్నారని అన్నారు. అదే విధంగా విలేకరులు, ప్రేక్షకులు దర్శకుల కష్టాన్ని గుర్తించి పాజిటివ్ రివ్యూలు, మంచి రెస్పాన్స్ ఇవ్వాలని కోరారు. ఒక సినిమా వెనుక దర్శకుడు ఎంతో కష్టపడతాడని, అలాంటి ప్రయత్నాలకు ప్రేక్షకుల ప్రోత్సాహం అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. దర్శకుడు కిరణ్ చాలా భిన్నమైన వ్యక్తి అని, వీధి కుక్కలను ఇంటికి తీసుకెళ్లి పెంచుకునేంత మంచి మనసు ఆయనకు ఉందని చెప్పుకొచ్చారు. అలాగే ఆగస్టు 6న విడుదలయ్యే నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సాలీడ్ అప్డేట్ తో అటు నాని అభమానులు, ఇటు ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
Also Read
ఇక హీరో శశి ఓదెల కూడా ఈ సందర్భంగా దర్శకుడు కిరణ్ గురించి మాట్లాడారు. దావూద్ ఇబ్రహీం గురించి ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ, అతని వ్యక్తిగత జీవితంలోని భావోద్వేగాలు, ప్రేమ, స్నేహం వంటి కోణాలను ఎవరూ చూపించలేదని కిరణ్ తరచూ చెప్పేవారని వెల్లడించారు. అదే అంశాన్ని తన సినిమా ద్వారా చూపించాలని కిరణ్ భావించాడని వివరించారు. తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్న శశి ఓదెల, ప్రతి ఉదయం లేవగానే తొలి సినిమాతోనే రూ.100 కోట్ల విజయం అందుకున్న తన అన్నను చూసేవాడినని, అదే సమయంలో తొలి సినిమాతోనే పరాజయం ఎదుర్కొన్న దర్శకుడు కిరణ్‌ను కూడా చూసేవాడినని అన్నారు. అయితే తన దృష్టిలో విజయాన్ని సాధించిన వ్యక్తి కంటే, ఓటమిని ఎదుర్కొని మళ్లీ నిలబడిన దర్శకుడే నిజమైన గొప్ప వ్యక్తి అని చెప్పడం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఒకే వేదికపై ‘ఫౌజీ’ రిలీజ్ డేట్, ‘ది ప్యారడైజ్’ టీజర్ అప్డేట్తో పాటు దర్శకుల కష్టం, ప్రేక్షకుల మద్దతు గురించి వచ్చిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పుడు ప్రభాస్ అభిమానులు డిసెంబర్ 2 కోసం, నాని అభిమానులు ఆగస్టు 6న విడుదల కానున్న ‘ది ప్యారడైజ్’ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..