Donald Trump: “ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే”.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: హైదరాబాద్ నగరంలో తన పేరు మీద ఒక రోడ్డుకు నామకరణం చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశం తనకు అందించిన ఈ గౌరవంపై స్పందిస్తూ, ఇది ఒక “అపూర్వమైన గౌరవం” అని అభివర్ణించారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ (Truth Social) లో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రారంభోత్సవ వేడుకకు సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేస్తూ.. “భారతదేశంలోని హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటైన డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ. ఈ రకమైన గౌరవం పొందిన మొట్టమొదటి యూఎస్ ప్రెసిడెంట్ నేనే. ధన్యవాదాలు! – ప్రెసిడెంట్ డొనాల్డ్ జె. ట్రంప్” అంటూ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అమెరికా రాయబార కార్యాలయం (యూఎస్ కాన్సులేట్) కు ఆనుకుని ఉన్న ఓ ప్రధాన రహదారికి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా పేరు మార్చిన కొద్ది రోజులకే ట్రంప్ నుంచి ఈ స్పందన వచ్చింది. హైదరాబాద్ నగరానికి ఉన్న అంతర్జాతీయ గుర్తింపును మరింత పెంపొందించడానికి, భారత్-అమెరికా మధ్య ఉన్న బలమైన సంబంధాలను చాటిచెప్పడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలు, యూఎస్ డిప్లొమాటిక్ మిషన్ ఉన్న హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని నానక్‌రామ్‌గూడలో ఈ అవెన్యూ ఉంది. హైదరాబాద్‌కు, యునైటెడ్ స్టేట్స్కు మధ్య ఉన్న బంధానికి ప్రతీకగానే ఈ నామకరణం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
Also Read
- CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
- Muncipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికీ ఛాన్స్..
- Rahul Gandhi: జ్ఞానేశ్ కుమార్ తర్వాత మోదీ వంతు.. రామ్‌లీలా మైదాన్‌లో రాహుల్ హెచ్చరిక!
- Amit Shah: ‘‘మీరు అక్కడే ప్రధానిగా ఉండండి’’.. రాహుల్‌పై అమిత్ షా సెటైర్!
అమెరికా స్వాతంత్ర్యానికి 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో భాగంగా ఈ వారంలోనే ఈ రోడ్డు నామఫలకాన్ని ఆవిష్కరించారు. భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ (Sergio Gor) తో పాటు తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని కీలకమైన రహదారులు, ప్రభుత్వ మౌలిక సదుపాయాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖులు, సంస్థల పేర్లు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్‌లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి ల్యాండ్‌మార్క్‌లతో తీర్చిదిద్దుతామని ప్రకటించారు. కాగా, ఒక అమెరికా అధ్యక్షుడికి భారత్‌లో ఈ తరహా గౌరవం దక్కడం ఇదే తొలిసారి కావడంతో, ట్రంప్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
తాజావార్తలు
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..