సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది.10వ తరగతి బోర్డు పరీక్షను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించే నియమాలను ఆమోదించింది. ఇప్పుడు 10వ తరగతి బోర్డు పరీక్షలను సంవత్సరానికి రెండుసార్లు సీబీఎస్‌ఈ నిర్వహిస్తుంది. ఈ అంశంపై పరీక్షల కంట్రోలర్ సంయమ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. రెండుసార్లు పరీక్షలు నిర్వహించే నమూనాను సీబీఎస్‌ఈ ఆమోదించిందని తెలిపారు. ఈ సంవత్సరం మొదటి పరీక్ష ఫిబ్రవరిలో, రెండవ పరీక్ష మేలో జరుగుతాయని వెల్లడించారు. ఫిబ్రవరిలో జరిగిన పరీక్ష ఫలితాలను ఏప్రిల్‌లో, మేలో జరిగిన పరీక్ష ఫలితాలను జూన్‌లో ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
READ MORE: V Hanumantha Rao: భర్త కోసం యమధర్మరాజుతో కూడా కొట్లాడిన భార్యలను చూశా.. కానీ ఇప్పుడు..
10వ తరగతి బోర్డు పరీక్ష (CBSE 10వ తరగతి బోర్డు పరీక్ష కొత్త నియమాలు) విద్యార్థులు మొదటి పరీక్షకు హాజరు కావడం తప్పనిసరి చేసింది. రెండో విడత పదో తరగతి పరీక్షలను ఆప్షనల్‌గా పెట్టింది. రెండు విడతల్లో మంచి స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. విద్యార్థులు తమ ఇష్టానుసారం రెండవ బోర్డు పరీక్షలో పాల్గొనవచ్చు. మొదటి సారి మార్కులు తగ్గితే.. మళ్లీ రెండో సారి రాసి మెరుగుపర్చుకోవచ్చు. మొదటి పరీక్షలో ఎక్కువ మార్కులు, రెండవ పరీక్షలో తక్కువ మార్కులు సాధిస్తే.. మొదటి పరీక్షలో పొందిన మార్కులను ఫైనల్‌గా పరిగణిస్తారు. కాగా..ముసాయిదా ప్రకారం.. మొదటి పరీక్ష ఫిబ్రవరి 17 నుంచి మార్చి 6 మధ్య, రెండవ దశ పరీక్షలు మే 5 నుంచి 20 వరకు జరుగుతాయని పేర్కొంది.
READ MORE: Sanjay Raut: ప్రజాస్వామ్యానికి చౌకీదార్ ఇందిరా గాంధీ.. ‘‘ఎమర్జెన్సీ’’ని సమర్థించిన సంజయ్ రౌత్..