Supreme Court: చికిత్స తర్వాత రోగి కోలుకోకపోయినా లేదా మరణిస్తే వైద్యుడు బాధ్యత వహించలేడని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రసవం అనంతరం ఓ మహిళ మరణానికి వైద్యుడే(గైనకాలజిస్ట్) బాధ్యత వహించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో విచారణ సందర్భంగా, జస్టిస్ సంజయ్ కుమార్, సతీష్ చంద్రలతో కూడిన ధర్మాసనం.. సంచలన వ్యాఖ్యలు చేసింది. శస్త్రచికిత్స విజయవంతం కాకపోతే లేదా ఆశించిన ఫలితం సాధించకపోతే ఆ వైద్యుడిని నిందించడం సరికాదని పేర్కొంది. ఏ వివేకవంతమైన ప్రొఫెషనల్ వైద్యుడు ఉద్దేశపూర్వకంగా రోగికి హానీ చేయాలని అనుకోడు. ఎందుకంటే ఆ అతడి ప్రతిష్ట ప్రమాదంలో పడుతుంది. డాక్టర్ చేసిన చిన్న తప్పునకు కూడా భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఒక్కోసారి అన్ని ప్రయత్నాలు చేసినా చికిత్స విఫలం కావచ్చని తెలిపింది. మరి కొన్నిసార్లు డాక్టర్ తన శాయశక్తులా ప్రయత్నించినా చికిత్స విఫలం కావచ్చని కోర్టు పేర్కొంది. వీటన్నింటికీ వైద్యుడిని దోషిని చేయలేమని తేల్చిచెప్పింది. వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడని నిరూపించడానికి ఖచ్చితమైన ఆధారాలు ఉంటే దోషిగా పరిగణించవచ్చని స్పష్టం చేసింది. వైద్య వృత్తి కొంతవరకు వ్యాపారంలా మారిందని కోర్టు అంగీకరించింది. కొంతమంది వైద్యులు డబ్బు సంపాదించడానికి తప్పులు చేస్తుంటారని.. అలా అని మిగతా డాక్టర్లందరినీ అవినీతిపరులుగా చూడలేమని కోర్టు తెలిపింది.
READ MORE: Gowra Hari : ఫోన్ కంటిన్యూగా రింగ్ అవుతూనే ఉంది..జ్వరంతో రెస్ట్ మోడ్ లోకి వెళ్ళా !