Group 1 Parents: హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు తర్వాత మీడియా ముందుకు వచ్చిన గ్రూప్-1 ర్యాంకర్ల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.. తమపై వస్తున్న ఆరోపణలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఒక్కో పేరెంట్ రూ.3 కోట్లు పెట్టి పోస్టులు కొన్నారనే వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక్కో పేరెంట్‌ది ఒక్కో రకమైన స్టోరీ. ఇప్పటికే భర్తను కోల్పోయిన మహిళల మాటలను అందరినీ కన్నీరు పెట్టేలా చేశాయి. తాజాగా మాజీ జవాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాతో మూడు కోట్లు ఉంటే చక్కగా నా కూతురికి పెళ్లి చేసేవాడిని కదా.. అంటూ వాపోయారు. ఈ దేశానికి సేవ చేసిన నన్ను ఆదర్శంగా తీసుకుని.. రాష్ట్రానికి సేవ చేస్తానని తన కుమార్తె ముందుకు వచ్చిందని తెలిపారు. అందుకోసం రూ. 10 లక్షల ప్యాకేజీని వదులుకుని రోజుకు 16 గంటలు చదివిందని వెల్లడించారు.
READ MORE: OG : పవర్ స్టార్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. OG ప్రీమియర్స్ క్యాన్సిల్
“నేను ఒక మాజీ సైనికుడిని. దేశం కోసం సేవ చేశాను. నా పాప ఎన్‌ఐటీ ద్వారా బీటెక్ చేసి.. పది లక్షల ప్యాకేజీని వదులుకుంది. నన్ను ఆదర్శంగా తీసుకుని ఈ రాష్ట్రానికి సేవ చేస్తా అని చెప్పింది.. 2020లో పది లక్షల రూపాల ప్యాకేజీ ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసింది. అప్పటి నుంచి రోజూ 16 గంటలు చదివింది. మూడో సారి మెయిన్స్ రాసింది. ర్యాంకు సాధించుకుంది. రేపు ఉద్యోగం వస్తది అనుకునేలోపే కోర్టులో కేసు పడింది. ఆమెకు అపాయింట్‌మెంట్ రాలేదు. కోర్టులో తీర్పు కూడా మాకు ప్రతికూలంగా వచ్చింది. ఆమెకు మ్యారేజీ చెయాల్సి ఉంది. అది కూడా ఆగిపోయింది. మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం. తెలంగాణ వస్తే మన జాబులు మనకే అన్నారు. 12 ఏళ్ల తరువాత సాకారం అయితది అనుకుంటే దానికి అడ్డుపుల్ల వేశారు.. సెలక్ట్ అయిన వాళ్లందరూ చాలా నైపుణ్యం గల పిల్లలు. అటువంటి పిల్లలను డబ్బులిచ్చి జాబులు కొన్నారని చెప్పి.. నానా విధాలుగా వాళ్లను ఇబ్బందులు పెడుతున్నారు. జాబ్ కోసం మూడు కోట్ల రూపాయలు పెట్టడానికి అవసరం ఏముంది. మూడు కోట్లు ఇచ్చి పెళ్లి చేసేవాళ్లము కదా.. పిల్లకు. తెలంగాణ సమాజం దీన్ని గుర్తించాలి. దీనికి సరైన గుణపాఠం చెప్పాలి.” అని ఓ మాజీ జవాన్ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.