UP:ముస్లింలకు ఆర్ఎస్ఎస్ అంటే గిట్టదు! ఈ సంస్థ సిద్ధాంతాలను ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటారు! ఆర్ఎస్ఎస్ దేశ ద్రోహ సంస్థ అని పలువురు ముస్లిం నాయకులు, కొన్ని పార్టీలకు చెందిన వ్యక్తులు వ్యాఖ్యానించడం తెలిసిందే. కానీ.. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ పరిణామం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముస్లిం సమాజానికి చెందిన సంస్థ తీసుకున్న నిర్ణయం ఆర్ఎస్ఎస్ ముస్లిం వ్యతిరేక సంస్థ అనే భావనను రూపుమాపేలా చేసింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: IAS Sanskriti Jain: సేవలకు దక్కిన గౌరవం.. ఐఏఎస్ అధికారిణిని పల్లకిలో మోస్తూ వీడ్కోలు పలికిన సిబ్బంది
ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌కు చెందిన ఒక ముస్లిం సామాజిక సంస్థ అయిన జమియత్ హిమాయతుల్ ఇస్లాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేఖ రాసింది. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. డాక్టర్ హెడ్గేవార్ జాతి నిర్మాణం, సామాజిక ఐక్యతకు సాటిలేని కృషి చేశారని, నేటికీ లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారని ఆ సంస్థ విశ్వసిస్తోందని అందులో పేర్కొన్నారు. జమియత్ హిమాయతుల్ ఇస్లాం అధ్యక్షుడు అబ్రార్ జమాల్ ఈ డిమాండ్‌ను లేవనెత్తారు. ఈ డిమాండ్‌ను తీవ్రంగా పరిగణించాలని అబ్రార్ జమాల్ ఆ లేఖలో ప్రభుత్వాన్ని కోరారు. ముస్లిం సమాజంతో అనుబంధంగా ఉన్న ఈ సంస్థ హెడ్గేవార్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. డాక్టర్ హెడ్గేవర్ ఆలోచనలు ఆయన చేసిన పనులు లక్షలాది మంది స్వచ్ఛంద సేవకులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని అబ్రార్ జమాల్ తన లేఖలో రాశారు. అటువంటి గొప్ప వ్యక్తిత్వం అత్యున్నత జాతీయ గౌరవానికి అర్హుడని నొక్కి చెప్పారు. ఈ లేఖ విడుదలైన వెంటనే ఒక్కసారిగా అందరూ షాక్‌కి గురయ్యారు.
READ MORE: Mass Jathara: “హుడియో.. హుడియో” అంటూ రవితేజ, శ్రీలీల రొమాంటిక్ బీట్..
ఇదిలా ఉండగా.. గతంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లిం-క్రిస్టియన్ మైనారిటీలకు ఆర్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు చేరువ కావాలని ఉద్ఘాటించారు. వారి దృక్కోణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా వారి సమస్యలను, భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని ఆయన కోరారు. అయితే ముస్లింలతో సంబంధాలను మెరుగుపరచుకోవడం గురించి సంఘ్ చీఫ్ మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. దీనికి ముందు, జమియత్ ఉలేమా-ఎ-హింద్ అధినేత మౌలానా అర్షద్ మదానీ, ఆల్ ఇండియా ముస్లిం ఇమామ్ ఆర్గనైజేషన్ అధినేత ఒమర్ అహ్మద్ ఇలియాసిని భగవత్ కలిశారు. హిందువులు, ముస్లింల డీఎన్‌ఏ ఒకటేనని ఆ సందర్భంగా భగవత్ అన్నారు. ముస్లింలు లేకుండా భారతదేశం అసంపూర్ణమని కూడా అన్నారు.
READ MORE: IAS Sanskriti Jain: సేవలకు దక్కిన గౌరవం.. ఐఏఎస్ అధికారిణిని పల్లకిలో మోస్తూ వీడ్కోలు పలికిన సిబ్బంది
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) వందేళ్ల చరిత్రలో నిషేధాలు, ప్రతిబంధకాలు, వివాదాలు ఎన్నో ఎదురైనప్పటికీ, ప్రతి దశలో తన శ్రేణులను విస్తరించుకుంటూ ముందుకెళ్లింది. హిందూ సమాజాన్ని సంఘటితం చేసి, జాతీయ పునరుజ్జీవానికి దారితీసేలా కృషి చేసేందుకు ఇది ఏర్పాటైంది. యుద్ధాలు, ఎమర్జెన్సీ, రామజన్మభూమి ఉద్యమం వంటి కీలక దశల్లో ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర దేశ రాజకీయ, సామాజిక మార్పులను ప్రభావితం చేసిందనే అభిప్రాయాన్ని చరిత్రకారులు వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభంలో చిన్న వలంటీర్ బృందంగా ఏర్పడి, దేశంలోని అతిపెద్ద సామాజిక సంస్థగా ఎదిగింది. గాంధీజీ హత్య తరువాత వచ్చిన ప్రతికూలత, అత్యవసర పరిస్థితి సమయంలో ఎదుర్కొన్న అడ్డంకులు, అయోధ్య ఉద్యమం వంటి దశలు సంఘానికి మలుపుతిప్పే సంఘటనలుగా నిలిచాయి. ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఎస్ లక్షలాది శాఖలతో సమాజంలో తన సిద్ధాంతాలను విస్తరించి, రాజకీయ, సామా జిక, సాంస్కృతిక రంగాల్లో ప్రభావం చూపుతోంది.