Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చేతిలో కమలా హారిస్ ఓటమిపై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జో బైడెన్, డెమోక్రటిక్ పార్టీతో ఐక్యత కోసం పోటీలో పాల్గొనకపోవడం వల్ల తాను ట్రంప్‌ను ఓడించడంలో విఫలమైనట్లు తెలియజేశారు. ఒకవేళ నేను పోటీలో నేను ఉంటే ట్రంప్‌ను కచ్చితంగా ఓడించేవాడిని అని జో బైడెన్ నమ్మకంగా పేర్కొన్నారు. అధికారంలో తిరిగి పోటీ చేయకూడదనే నిర్ణయంపై నాకు విచారం లేదు. నేను, కమలా […]
Los Angeles Fire: అమెరికా ఎప్పుడు లేని పరిస్థితితో సతమతమవుతోంది. గత కొన్ని రోజులుగా కేలిఫోర్నియాలోని లాస్ ఏంజెలెస్ నగరాన్ని చుట్టుముట్టిన కార్చిచ్చులు ఆగని మంటలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మరొకవైపు టెక్సాస్, ఒక్లహోమా వంటి రాష్ట్రాల్లో మంచు తుపాను ప్రజలను వణికిస్తోంది. కేలిఫోర్నియాలో మంటలు పెద్దగా వ్యాప్తి చెందుతున్నాయి. లాస్ ఏంజెలెస్ పరిసర ప్రాంతాల్లో మంటలు విస్తరిస్తున్నాయి. దాదాపు 13,000 ఇళ్లతో పాటు ఇతర కట్టడాలు కాలి బూడిద అయ్యాయి. ఇక ఈ ఘటనలో ఇప్పటివరకు […]
Sabarimala Devotees: కేరళలోని ప్రముఖ శబరిమల ఆలయాన్ని పర్యవేక్షించే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) తాజాగా యాత్రికుల కోసం ఉచిత ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయం, ఇటీవల జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో పలువురు అయ్యప్ప భక్తులు మరణించడం వల్ల తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ బీమా పథకం ద్వారా యాత్రికులు ప్రమాదంలో మరణించినప్పుడు వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించనున్నారు. Also Read: CM Revanth Reddy : సీఎం రేవంత్ […]
Bank Of Baroda: బ్యాంకులలో ఉద్యోగం పొందాలనుకునే వారికి శుభవార్త. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, బ్యాంక్ ఆఫ్ బరోడా మొత్తం 61 రకాల 1,267 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు రిక్రూట్మెంట్ విడుదల చేసింది. ఇందుకోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ bankofbaroda.in ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 17 జనవరి, 2025 వరకు చివరి అవకాశం. ఈ రిక్రూట్మెంట్ కోసం […]
Adam Gilchrist: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఘాటు వ్యాఖ్యలు చేసాడు. టెస్ట్ ఫార్మాట్లో రోహిత్ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అతని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ తన కెరీర్‌పై ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపాడు. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్ట్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. మూడు మ్యాచుల్లో ఆరు […]
Virat Kohli: క్రికెట్ లో గొప్ప గొప్ప విజయాలు సాధించిన విరాట్ కోహ్లీ ఎంత సక్సెస్ ఫుల్ ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. అయితే, ఎంత గొప్ప ఆటగాడైన అప్పుడప్పుడు ఫామ్ కోల్పోవడం పరిపాటే. ప్రస్తుతం విరాట్ కోహ్లీ కూడా ఆ పరిస్థితులలో ఉన్నాడు. ఇకపోతే తాజాగా కోహ్లీ అతని భార్య అనుష్క శర్మతో కలిసి మరోసారి ప్రముఖ సాధువు ప్రేమానంద్ మహారాజ్ ను కలవడానికి బృందావన్ వెళ్లారు. గతంలో కూడా కోహ్లీ తన ఫామ్ […]
Costly Catch: దక్షిణాఫ్రికా వేదికగా SA20 లీగ్ మొదలైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ మాదిరిగానే దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈ లీక్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు పొందింది. గడిచిన రెండు సీజన్లలో సన్ రైజర్స్ యాజమాన్యానికి చెందిన టీం విజయం సాధించగా.. ప్రస్తుతం మూడో సీజన్ మొదలైంది. ఈ లీగల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ క్రికెటర్లందరూ వారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మామూలుగా అయితే క్రికెట్ ఆడినందుకు ఆడవాళ్లకు అలాగే సిబ్బందికి మాత్రమే డబ్బులు సంపాదిస్తుంటారు. కాకపోతే కొన్ని […]
Champions Trophy 2025: 2025 ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ వేదికగా ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి జట్టును ప్రకటించేందుకు ఐసీసీ జనవరి 12న గడువు తేది నిర్ణయించింది. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జట్టును ప్రకటించేందుకు మరింత ఆలస్యం కావచ్చు. తాజా సమాచారం ప్రకారం, బీసీసీఐ తన జట్టును సకాలంలో ప్రకటించడానికి ఐసీసీని మరికొంత సమయం డిమాండ్ చేయవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం, ఐసీసీ సూచనలకు అనుగుణంగా, టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్ […]
Tamim Iqbal Retirement: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి బంగాళాదేశ్ సీనియర్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ పునరాగమనం చేయగలడని గత కొన్ని రోజుల ముందు ఊహాగానాలు ఉండేవి. అయితే, ఈ వెటరన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి రావడం లేదని ప్రకటించడం ద్వారా అన్ని చర్చలకు ముగింపు పలికాడు. సోషల్ మీడియా పోస్ట్‌లో, అతను తన అంతర్జాతీయ కెరీర్‌కు అధికారికంగా వీడ్కోలు చెప్పాడు. బంగ్లాదేశ్ క్రికెట్ స్టార్ తమీమ్ ఇక్బాల్ 35 ఏళ్ల […]
Viral Video: ప్రస్తుత రోజులలో ఏ సమయాన ఏమి జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు సురక్షితంగా ఇంటికి వస్తారన్న నమ్మకం రోజురోజుకి లేకుండా అయిపోతుంది.. కాలక్రమన వెళ్తున్న మార్గంలో రోడ్ యాక్సిడెంట్ల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే.. మరికొందరు గుండెపోట్ల వల్ల మరణిస్తున్నారు. మరోవైపు విద్యార్థులు స్కూల్లో అనుకోని సంఘటనల వల్ల వాళ్లు ప్రాణాలు కోల్పోవడం లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అయితే, తాజాగా అహ్మదాబాద్ లో […]