Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, దేశంలో అత్యున్నత కార్యక్రమాలు నిర్వహించే ప్రత్యేక స్థలం ఇది. ప్రధాని ప్రమాణ స్వీకారం, విదేశీ దేశాధినేతల సమావేశాలు, గౌరవ విందులు లాంటి కార్యక్రమాలు మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. అయితే, ఈసారి మాత్రం రాష్ట్రపతి భవన్ ఓ ప్రత్యేకమైన వేడుకకు ఆతిథ్యం ఇవ్వనుంది. అది మరేదో కాదు.. ఓ పెళ్లి వేడుక! ఏంటి రాష్ట్రపతి భవన్‌లో పెళ్లి ఏంటని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి బాబు.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం.
Also Read: Mahindra XUV400 : బంఫర్ ఆఫర్.. ఈ మహీంద్రా ఎలక్ట్రిక్ కారుపై ఏకంగా 4లక్షల తగ్గింపు!
ఇకపోతే, ఈ పెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కుటుంబానికి సంబంధించినదో లేక మరో ఉన్నత స్థాయి వ్యక్తులదో కాదండోయ్.. మధ్యప్రదేశ్‌కు చెందిన సీఆర్పీఎఫ్ (CRPF) అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా వివాహం రాష్ట్రపతి భవన్‌లో జరగనుంది. ద్రౌపది ముర్ము ప్రత్యేకంగా ఈ అవకాశం ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఇంతకి ఈ పూనమ్ గుప్తా ఎవరనే కదా మీ ప్రశ్న. పూనమ్ గుప్తా ప్రస్తుతం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ భద్రత విభాగంలో పీఎస్ఓ (Personal Security Officer) హోదాలో పని చేస్తున్నారు. తన విధుల్లో అత్యంత క్రమశిక్షణ, నిబద్ధతతో పని చేస్తున్న పూనమ్ గుప్తాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలుమార్లు ప్రశంసించారు. గణతంత్ర దినోత్సవంలో సీఆర్పీఎఫ్ మహిళా దళానికి సారథ్యం వహించిన పూనమ్ గుప్తా రాష్ట్రపతి దృష్టిలో మరింత మంచి స్థానం సంపాదించారు.
అయితే, పూనమ్ గుప్తాకు జమ్ముకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేస్తున్న అవ్నీష్ కుమార్‌తో వివాహం ఖరారైంది. ఫిబ్రవరి 12న వీరి వివాహం జరగనుంది. పెళ్లి ఆహ్వానం అందించే సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారి వివాహం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో వివాహం చేసుకోవాలని సూచించారట. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ వివాహాన్ని రాష్ట్రపతి భవన్‌లోని మదర్ థెరిస్సా క్రౌన్ కాంప్లెక్స్‌లో నిర్వహించుకోవాలని సూచించారు. ఈ అరుదైన అవకాశాన్ని పూనమ్ గుప్తా, అవ్నీష్ కుమార్, వారి కుటుంబ సభ్యులు సంతోషంగా అంగీకరించారు. దీనితో దేశ చరిత్రలో మొదటి సారి రాష్ట్రపతి భవన్‌లో మోగనున్న పెళ్లి భాజా మోగనుంది.
Also Read: IND vs ENG: టీం నుండి కోహ్లీ, పంత్ అవుట్.. మొదట బ్యాటింగ్ చేయనున్న టీమిండియా
పూనమ్ గుప్తా విద్య, కెరీర్ ప్రయాణం చూస్తే.. ఆమె చిన్నతనం నుంచే ధైర్యవంతురాలు. నవోదయ విద్యాలయంలో చదివిన పూనమ్ గుప్తా గణితంలో గ్రాడ్యుయేషన్, ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. గ్వాలియర్‌లోని శివాజీ విశ్వవిద్యాలయంలో బీఈడీ పూర్తి చేశారు. 2018లో యూపీఎస్‌సీ సీఏపీఎఫ్ (UPSC CAPF) పరీక్షల్లో 81వ ర్యాంక్ సాధించి CRPFలో అసిస్టెంట్ కమాండెంట్‌గా చేరారు. మొత్తానికి రాష్ట్రపతి భవన్‌లో పెళ్లి చేసుకునే అరుదైన అవకాశం ఇప్పటి వరకు ఎవరికి కలగలేదు. ఇది పూనమ్ గుప్తా సేవల పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉన్న కృతజ్ఞతను స్పష్టంగా చూపిస్తోంది. ఈ వివాహం రాష్ట్రపతి భవన్‌కు మరింత ప్రత్యేకతను తీసుకరానుంది.