Nizamabad: నిజామాబాద్‌లో ఓ యువకుడిని హత్య చేసి, ఆ తర్వాత మృతదేహాన్ని కాల్చిన ఘోరం వెలుగుచూసింది. ఇందల్వాయి అటవీ ప్రాంతంలో ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆటో కోసం స్నేహితుడినే హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిజామాబాద్ బ్రాహ్మణ కాలనీకి చెందిన సందీప్ ఈనెల 15న మిస్సింగ్ అయ్యాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా అతని ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు తెలిపారు. దానితో కేసు నమోదు చేసి దర్యాప్తు […]
Viral Video: దేశం గర్వించేలా పవర్ లిఫ్టింగ్‌లో రాణించాలని అనుకున్న 17 ఏళ్ల యష్టికా ఆచార్య జరిగిన ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్‌లో మంగళవారం రాత్రి ఈ విషాద ఘటన జరిగింది. బడా గణేష్ జీ టెంపుల్ దగ్గర ఉన్న ఓ ప్రైవేట్ జిమ్‌లో యష్టికా ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యష్టికా తన కోచ్ పర్యవేక్షణలో 270 కేజీల బరువును లిఫ్ట్ చేయడానికి ప్రయత్నించింది. అయితే, అనూహ్యంగా బ్యాలెన్స్ తప్పి […]
iPhone 16e: ఆపిల్ నుంచి కొత్త ఐఫోన్ రాబోతోందని అనేక రోజులుగా లీకులు వచ్చాయి. మొదటగా ఈ ఫోన్‌ను ఐఫోన్ SE 4గా విడుదల చేస్తారని ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే ఆపిల్ అన్ని ప్రచారాలకు తెరదించుతూ, ఐఫోన్ 16e పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఆపిల్ ఇంటెలిజెన్స్‌ను సపోర్ట్ చేయడంతోపాటు, మెరుగైన ప్రదర్శనను అందించనుందని కంపెనీ తెలిపింది. ఇక ఈ ఐఫోన్ 16e స్పెసిఫికేషన్లు, ఫీచర్ల విషయానికి వస్తే.. * డిస్ప్లే: – […]
Electric Shock: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బపూర్ గ్రామంలో శివాజీ జయంతి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తుండగా 13 మంది విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో లింగ ప్రసాద్ (23) అనే యువకుడు మృతి చెందాడు. అలాగే ఈ ఘటనలో మరో యువకుడు వడ్డే కర్ణాకర్ (25) పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కర్ణాకర్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం […]
Komatireddy Venkat Reddy: సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లిలో జరుగుతున్న లింగమంతుల జాతరలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వం సెక్యూలర్ విధానాన్ని పాటిస్తుందని, అన్ని మతాలను గౌరవిస్తుందని పేర్కొన్నారు. మాది సెక్యూలర్ ప్రభుత్వమని, మాకు అన్ని పండుగలు సమానమేనని అన్నారు. ప్రజలందరికీ సమాన న్యాయం అందించడమే మా ధ్యేయం అని […]
CM Revanth Reddy: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. భారత దేశానికి అపారమైన సేవలు అందించిన శివాజీ మహారాజ్ వీరత్వం, పరిపాలనా నైపుణ్యం స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు వాకాటి శ్రీహరి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొని శివాజీ మహారాజ్ చిత్రపటానికి పుష్పాంజలి అర్పించారు. శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, […]
TGSRTC: హైదరాబాద్ – విజయవాడ రూట్లలో ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుడ్ న్యూస్ అందించింది. ప్రత్యేక రాయితీలను ప్రకటిస్తూ ప్రయాణికులకు సదుపాయాలు కల్పిస్తోంది ఆర్టిసి. విజయవాడ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు టీజిఎస్ఆర్టీసీ నాన్ ఏసీ లహరి స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ బస్సుల్లో టికెట్లపై 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే, రాజధాని ఏసీ బస్సుల్లో 8 శాతం రాయితీని అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. TGSRTC ఈ అవకాశాన్ని […]
KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) తెలంగాణ భవన్లో జరుగనున్న పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యేందుకు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి నగరానికి బయల్దేరారు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్‌కు రావడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి “తాను కొడితే మామూలుగా ఉండబోదు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి బీఆర్ఎస్ మరోసారి ముమ్మరంగా కార్యాచరణ సిద్ధం […]
MLC Elections: వరంగల్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రబెల్లి ప్రదీప్ నివాసంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ తోపాటు బిజెపి రాష్ట్ర, జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రచారానికి వెళ్తే ప్రజలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. విద్య వ్యవస్థలను కేసీఆర్ బ్రష్టు పట్టించారని.. అదే విధంగా కాంగ్రెస్ కూడా ముందుకు సాగుతున్నదని విమర్శించారు. బీఆర్ఎస్కు పట్టిన […]
Electricity Demand: తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డుస్థాయిలో పెరగడంతో 16000 మెగావాట్ల మైలురాయిని అధిగమించింది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విద్యుత్ సంస్థల సీఎండీలతో సరఫరా పరిస్థితిని సమీక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో 2025 ఫిబ్రవరి 19 ఉదయం 7 గంటల 55 నిమిషాలకు 16058 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఇదే నెల 10వ తేదీన 15998 మెగావాట్లు నమోదు కాగా తాజా డిమాండ్ ఆ రికార్డును అధిగమించింది. గత ఏడాది […]