Nizamabad: ఆటో కోసం స్నేహితుడి హత్య.. అంతటితో ఆగకుండా?
- ఆటో కోసం స్నేహితుడి హత్య.
- హత్యకు పాల్పడి మృతదేహంను కాల్చేసిన కిరాతకుడు.
- ఇందల్వాయి అటవీ ప్రాంతంలో ఈ దారుణ ఘటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nizamabad: నిజామాబాద్‌లో ఓ యువకుడిని హత్య చేసి, ఆ తర్వాత మృతదేహాన్ని కాల్చిన ఘోరం వెలుగుచూసింది. ఇందల్వాయి అటవీ ప్రాంతంలో ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆటో కోసం స్నేహితుడినే హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిజామాబాద్ బ్రాహ్మణ కాలనీకి చెందిన సందీప్ ఈనెల 15న మిస్సింగ్ అయ్యాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా అతని ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు తెలిపారు. దానితో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, రెండు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 17న ఇందల్వాయి అటవీ ప్రాంతంలో సందీప్ హత్యకు గురై మృతదేహం కాలిపోయిన స్థితిలో కనబడింది.
Read Also: Viral Video: 270 కేజీల బరువు ఎత్తబోయి ప్రాణాలు పోగొట్టుకున్న వెయిట్‌లిఫ్టర్..
Also Read
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు, నాగారం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సతీష్ గౌడ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతను గతంలోనూ నేరచరిత్ర కలిగిన వ్యక్తిగా గుర్తించారు. విచారణలో నిందితుడు హత్యను అంగీకరించాడు. సందీప్ ఆటో కొనడానికి బంగారం తాకట్టు పెట్టాడు. మరుసటి రోజునే సందీప్‌ను హత్యకు గురి అయ్యాడు. హత్య అనంతరం మృతదేహాన్ని దహనం చేసి అటవీ ప్రాంతంలో వదిలేశాడు. పోలీసులు నిందితుడి వద్ద నుంచి ఆటో, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సందీప్ హత్య కేసు ఒక్కరితో మాత్రమే సంబంధం ఉందా, లేక మరికొందరు కూడా దీనికి పాల్పడ్డారన్న కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. మృతుని కుటుంబ సభ్యులు దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: IND vs BAN: నేడే బంగ్లాతో టీమిండియా తొలి సమరం..
మా కుటుంబానికి న్యాయం జరగాలని, చివరి చూపు చూడకుండా మృతదేహాన్ని కాల్చేశారని మృతుని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసారు. ఈ కేసును ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేసారు. సందీప్ కుటుంబ సభ్యులు నిందితుడికి కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడికి సహకరించిన వారిపై కూడా విచారణ కొనసాగిస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!