Toilet Usage Management Rule: ఆఫీస్ లలో పనిచేసేవారు ఎన్నో కొత్త కొత్త రూల్స్ వినడం వాటిని ఆచరించడం పరిపాటే. అయితే, తాజాగా చైనా దక్షిణ ప్రాంతంలోని ఒక కంపెనీ ఉద్యోగుల మరుగుదొడ్ల వినియోగంపై కఠిన నియమాలను అమలు చేయడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఫోషాన్ లో ఉన్న ‘త్రీ బ్రదర్స్ మెషిన్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ’ ఫిబ్రవరి 11 నుంచి కొత్త టాయిలెట్ యూజేజ్ మేనేజ్మెంట్ రూల్ అమలు చేసింది. […]
Bank of Baroda: నిరుద్యోగ యువతకు బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త అందించింది. రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెషనల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 518 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక ఆన్లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా జరగనుంది. ఉద్యోగంలో ఎంపికైన వారికి అధిక వేతనం లభించనుంది. ఈ నోటిఫికేషన్లో సీనియర్ మేనేజర్, […]
Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా చివరి వారంలోకి ప్రవేశించడంతో, ఫిబ్రవరి 26న ముగియనున్న ఈ మహోత్సవానికి మరో అద్భుతమైన ఖగోళ ఘట్టం తోడవ్వనుంది. ఫిబ్రవరి 28న సౌర మండలంలోని ఏడు గ్రహాలన్నీ ఒకేసారి రాత్రి ఆకాశంలో ప్రత్యక్షమయ్యే అరుదైన దృశ్యం మనకు కనువిందు చేయనుంది. సూర్యుడి చుట్టూ పరిభ్రమించే బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ ఏడు గ్రహాలు ఒకే సరళ రేఖపై రానున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. రాత్రి సమయంలో భారతదేశం […]
Drinking Warm Water: నీరు మన జీవితానికి ఎంతో అవసరం. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సాధారణంగా చాలా మంది చల్లని నీరు తాగే అలవాటు చేసుకుంటారు. అయితే, వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం వేడి లేదా గోరు వెచ్చని నీరు తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని సూచిస్తున్నారు. అయితే, ఈ ప్రయోజనాలను చాలామంది గుర్తించరు. వైద్య నిపుణుల ప్రకారం.. వేడి నీరును రోజులో ఎప్పుడైనా తాగవచ్చు. […]
Matrimonial Sites: గుజరాత్‌కి చెందిన 26 ఏళ్ల యువకుడిని వసాయి ఈస్ట్‌లోని వాలివ్ పోలీస్ బుధవారం అరెస్ట్ చేసారు. అతను మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా పరిచయం అయిన 15కి పైగా మహిళలను గత రెండున్నర సంవత్సరాలుగా పెళ్లి పేరుతో మోసం చేసి లైంగికంగా, ఆర్థికంగా దోచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అహ్మదాబాద్‌కు చెందిన హిమాంషు యోగేశ్‌భాయ్ పంచాల్ అనే వ్యక్తి మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో తనను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సైబర్ సెక్యూరిటీ డివిజన్లో […]
Gold Rates: గత కొద్ది రోజుల నుంచి ఆకాశమే హద్దుగా బంగారం, వెండి ధరలు దూసుకు వెళ్తున్నాయి. గత రెండు మూడు నెలల్లోనే దాదాపు పది శాతం పైగా బంగారం ధరలు పెరిగాయి అంటే.. ఎంతలా ధరలు పెరుగుతున్నాయా అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు బంగారం ధరలు ఆల్ టైం రికార్డులు సృష్టిస్తున్నాయి. శుక్రవారం నాడు బంగారం ధర పెరుగుదల కాస్త శాంతించిందని చెప్పవచ్చు. తాజాగా తులం బంగారంపై కేవలం వంద రూపాయలు మాత్రమే పెరిగింది. […]
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా గెలుపుతో శుభారంభం చేసింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి గ్రూప్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. మహ్మద్ షమీ ఐదు వికెట్లు పడగొట్టడంతో బంగ్లాదేశ్ 228 పరుగులకే ఆలౌట్ అయింది. ఛేజింగ్‌లో రోహిత్ శర్మ మెరుపు బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. 36 బంతుల్లో 41 పరుగులు చేసి టీమిండియాకు చక్కటి ఆరంభాన్ని ఇచ్చాడు. ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో […]
Champions Trophy 2025: 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ఇండియా విజయంతో శుభారంభం చేసింది. గురువారం జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే, ఈ విజయంతో అందరూ సంతోషంగా ఉన్న.. అక్షర్ పటేల్‌కు మాత్రం కొంత అసంతృప్తి మిగిలింది. హ్యాట్రిక్‌కు ఒక్క వికెట్ దూరంలో ఉన్న అతడు, కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ వదిలేయడం కారణంగా గొప్ప అవకాశాన్ని కోల్పోయాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో అక్షర్ 9వ ఓవర్లో వరుసగా రెండు వికెట్లు తీసి […]
Bomb Blast: ఆగి ఉన్న మూడు బస్సులలో వరుస పేలుళ్లు సంభవించడంతో సెంట్రల్ ఇజ్రాయెల్ దద్దరిల్లింది. ఇది ఉగ్రవాద దాడిగా అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి ఎవరూ గాయపడినట్లు, మరణించినట్లుగాను నివేదిక లేదు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ గాజా నుండి నలుగురు బందీల మృతదేహాలను తిరిగి ఇచ్చిన తర్వాత ఇజ్రాయెల్ ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఇవే కాకుండా మరో రెండు బస్సుల్లో పేలుడు పదార్థాలు దొరికాయని, కానీ.. అవి పేలలేదని […]
Sand Mafia: హైదరాబాద్ నగరంలో సాండ్ మాఫియా అక్రమాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నగరంలో అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్న ఇసుక డంప్‌లపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో 1,100 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడుల్లో మొత్తం 57 మంది నిందితులను అరెస్ట్ చేసి, వారి మీద కఠిన చర్యలు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో నది పరివాహక ప్రాంతాల్లో ఇసుకను డెలివరీ చేస్తున్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా నిల్వ చేస్తున్న […]