CM Revanth Reddy: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. భారత దేశానికి అపారమైన సేవలు అందించిన శివాజీ మహారాజ్ వీరత్వం, పరిపాలనా నైపుణ్యం స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు వాకాటి శ్రీహరి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొని శివాజీ మహారాజ్ చిత్రపటానికి పుష్పాంజలి అర్పించారు. శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, పరిపాలనా విధానాలు నేటితరానికి మార్గదర్శకంగా ఉంటాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల సేవలో ప్రతి నాయకుడు పని చేయాలని నేతలు సంకల్పం వ్యక్తం చేశారు.
Read Also: TGSRTC: విజయవాడ రూట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్లపై భారీగా డిస్కౌంట్స్
ఇక దేశవ్యాప్తంగా శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆరాధ్య దైవంగా కొలిచే మహారాష్ట్ర ప్రజలు వాడవాడన సంబరాలు జరుపుకుంటున్నారు.