GVL Narasimha Rao: విశాఖ భూముల విషయంలో ఏపీ ప్రభుత్వంపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్ర ఆరోపణలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంపై వైసీపీ నుంచి సంతృప్తికర సమాధానం రావటం లేదని జీవీఎల్ అసహనం వ్యక్తం చేశారు. సామాన్యుడికి న్యాయం జరగకుండా సంపన్నులకు న్యాయం చేసేలా చేస్తున్నారని మండిపడ్డారు. జీవీఎల్ ఎవరు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అంటున్నారని.. ఇదే అమర్నాథ్ గతంలో ఈ అంశంపై సీబీఐ విచారణ […]
Mulayam Singh Yadav: ఉత్తర ప్రదేశ్ ఇటావా జిల్లాలోని సైఫయా గ్రామంలో సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరై ములాయం భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్‌ను కేసీఆర్ పరామర్శించారు. ములాయం అంత్యక్రియల్లో కేసీఆర్‌తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ నేత శ్రవణ్ కుమార్ కూడా […]
IND Vs SA: ఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా బౌలర్లు విజృంభించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో కేవలం 27.1 ఓవర్లలో 99 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌటైంది. టీమిండియా ముందు 100 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్ గెలిస్తే మూడు వన్డేల సిరీస్ భారత జట్టు సొంతం అవుతుంది. 34 పరుగులు చేసిన క్లాసెన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జానేమన్ మలాన్ […]
Ambulance Mafia: ఏపీలో అంబులెన్స్ మాఫియా ఆగడాలు కొనసాగుతున్నాయి. గతంలో తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద ప్రైవేట్ అంబులెన్స్ డాక్టర్ల నిర్వాకం పలు విమర్శలకు దారి తీసిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా తిరుపతి జిల్లాలో అలాంటి ఘటన మరోసారి చోటుచేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలంలో ఓ బాలుడు పాముకాటుతో మృతి చెందాడు. దిగువ పుత్తూరు గ్రామంలో బాలుడు బసవయ్య పాము కాటు కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స […]
Coach Restaurant: ఇటీవల రెస్టారెంట్లు సాధారణంగా ఉంటే కస్టమర్లకు నచ్చడం లేదు. అందుకే ప్లాట్‌ఫామ్ రెస్టారెంట్, జైల్ రెస్టారెంట్ వంటి యాంబియెన్స్ ఉంటే అలాంటి రెస్టారెంట్లకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. అందుకే దక్షిణ మధ్య రైల్వే వినూత్నంగా ఆలోచించి ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే కోచ్ రెస్టారెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గుంటూరు రైల్వేస్టేషన్ ప్రాంతంలో ఈ రెస్టారెంట్‌ను దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రారంభించారు. రైలు పట్టాలను ఏర్పాటు చేసి వాటిపై స్లీపర్ కోచ్‌ను పూర్తి ఏసీ సదుపాయంతో రెస్టారెంట్‌గా […]
IND Vs SA: ఢిల్లీ వేదికగా టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య కీలక మూడో వన్డే జరుగుతోంది. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా, రెండో వన్డేలో టీమిండియా గెలవడంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. దీంతో ఈ వన్డేలో ఎవరు గెలిస్తే మూడు వన్డేల సిరీస్ వారికే సొంతం అవుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రెండో వన్డేలో ఆడుతున్న టీమ్‌నే మూడో వన్డేలోనూ […]
Pulasa Price: గోదావరి పులసలకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గోదావరిలో దొరికే పులసలను పుస్తెలను విక్రయించైనా సరే తినాలనే నానుడి ఉంది. లైవ్ పులస దొరికితే ఇంకా ఊరుకుంటారా చెప్పండి. ఈ నేపథ్యంలో ఓ పులస ప్రియుడు లైవ్ పులస దొరకడంతో సోమవారం భారీ రేటుకు కొనుగోలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పులస దొరకడమే గగనమనుకుంటుంటే లైవ్ పులస దొరకడంతో జాలరి కూడా సంబరపడ్డాడు. ఎందుకంటే లైవ్ పులస దొరకడం చాలా […]
Rupee Value: అమెరికా కరెన్సీ డాలర్‌తో పోలిస్తే ఇండియన్ కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకు దిగజారుతోంది. చమురు ధరలు, ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుదల, విదేశీ సంస్థాగత నిధుల ఉపసంహరణ, యూఎస్ కరెన్సీకి డిమాండ్ పెరుగుదల వంటి అంశాలు రూపాయి పతనానికి కారణమవుతున్నాయని బిజినెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సోమవారం నాడు రూపాయి విలువ 82.33 నుంచి 82.66కు పడిపోయింది. అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన డాలరు నిల్వలను ఖర్చు చేస్తూ రూపాయి పతనం కాకుండా జోక్యం […]
Andhra Pradesh: ఏపీ పాఠశాల విద్యావ్యవస్థలో కీలక అడుగు పడింది. విద్యాశాఖలో తొలిసారిగా ప్రపంచ బ్యాంకు భాగస్వామ్యం అవుతోంది. ఈ మేరకు వివరాలను పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ వెల్లడించారు. రాష్ట్రంలో నాడు-నేడు పనులను ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టు కిందే చేస్తున్నామని ఆయన తెలిపారు. 2012లో సాల్ట్ ప్రాజెక్టు కింద ప్రపంచ బ్యాంకు 250 మిలియన్ డాలర్ల ఆర్ధిక సాయం అందిస్తోందన్నారు. ఈ రుణం కోసం ప్రపంచ బ్యాంకు ఎలాంటి షరతులను విధించలేదని స్పష్టం […]
OTT Updates: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం. సెప్టెంబర్ 9న విడుదలైన ఈ మూవీ తొలిరోజే మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో అక్కినేని అమల శర్వానంద్ తల్లి పాత్రలో నటించారు. మదర్ సెంటిమెంటుతో సాగే ఈ సినిమా ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఈ మూవీలో శర్వాకు జోడీగా రీతూవర్మ హీరోయిన్‌గా నటించింది. డ్రీమ్ వారియర్ […]