Amitabh Bachchan: 80 ఏళ్ల వయసులోనూ బాలీవుడ్ అగ్రహీరో అమితాబ్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆయనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన సినిమా సెలబ్రిటీగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. మంగళవారం అమితాబ్ 80వ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా మోతెక్కిపోయింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆయనకు లక్షలాది మంది అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అమితాబ్‌కు ఫేస్‌బుక్‌లో 39 మిలియన్‌లు, ట్విట్టర్‌లో 48.1 మిలియన్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 31.4 మిలియన్‌ల ఫాలోవర్లు ఉన్నారు. ప్రతిరోజు […]
Sourav Ganguly: బీసీసీఐ నుంచి గంగూలీ నిష్క్రమణ ఖరారైంది. గత మూడేళ్లుగా బీసీసీఐ అధ్యక్షుడిగా చక్రం తిప్పిన గంగూలీ పదవీకాలం ఈనెల 18తో ముగియనుంది. దీంతో బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా 1983 ప్రపంచకప్ హీరో రోజర్ బిన్నీ ఎన్నిక కానున్నాడు. ఈనెల 18న ముంబైలో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా బిన్నీ అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నాడు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా రెండోసారి కూడా బీసీసీఐ కార్యదర్శిగానే […]
Andhra Pradesh: ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కారు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. మెడికల్ రీఎంబర్స్‌మెంట్ పథకం గడువును పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2022 ఆగస్టు 1 నుంచి 2023 మార్చి 31 వరకు మెడికల్ రీఎంబర్స్‌మెంట్ పథకం గడువును పొడిగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా మెడికల్ రీఎంబర్స్‌మెంట్ పథకాన్ని పొడిగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల […]
Andhra Pradesh: ఏపీలో ప్రస్తుతం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగుల హాజరు నమోదుకు ఫేస్ రికగ్నేషన్ యాప్ వాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమరావతిలోని సెక్రటేరియట్‌లో విధులు నిర్వహించే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఫేస్ రికగ్నేషన్ యాప్ అటెండెన్స్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సెక్రటేరియట్‌లోని ఉన్నతాధికారులు ఫోన్‌లలో ఫేస్ రికగ్నేషన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈనెల ఆరో తేదీ నుంచి ఫేస్ రికగ్నేషన్ […]
Kottu Satyanarayana: ఏపీలో ప్రముఖ దేవాలయాల్లో క్షురకులుగా పనిచేసే వారికి ఊరట కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్షురకులకు నెలకు కనీసం రూ.20వేల ఆదాయం వచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. రూ.20వేల కంటే తక్కువ వచ్చే ఆలయాల్లో ఆలయ వెల్ఫేర్ ట్రస్టు ద్వారా మిగతా మొత్తాన్ని ఇప్పించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. ప్రస్తుతం ప్రధాన ఆలయాల్లో టిక్కెట్ల ద్వారా క్షురకులు ప్రతి నెలా ఆదాయం పొందుతున్నారని.. ఒకవేళ వాళ్లకు రూ.20వేల […]
MS Dhoni: టీమిండియాకు మహేంద్ర సింగ్ ధోనీ తన నాయకత్వంలో ఎన్నో టైటిళ్లను అందించాడు. అతడి కెప్టెన్సీలో భారత్ టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్ సహా టెస్టుల్లోనూ నంబర్‌వన్ స్థానాన్ని అందుకుంది. అటు ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ధోనీ విజయవంతం అయ్యాడు. చెన్నై జట్టును ఏకంగా నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ఘనతను సాధించాడు. వికెట్ కీపింగ్, బ్యాటింగ్, కెప్టెన్సీ.. ఇలా ఏ బాధ్యత ఇచ్చినా ధోనీ సమర్థంగా నిర్వర్తించాడు. అందుకే ధోనీ అంటే చాలా […]
Vijayawada: దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ అమ్మవారికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఆర్జిత సేవలు, దర్శన టిక్కెట్లు, లడ్డూ ప్రసాదం, భక్తులు తలనీలాల సమర్పణ ద్వారా రూ.6.34 కోట్ల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. లడ్డూ ప్రసాదాల ద్వారా రూ.2.48 కోట్లు, దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.2.5 కోట్లు, ఆర్జిత సేవా టిక్కెట్ల ద్వారా రూ.1.03 కోట్లు, తలనీలాల ద్వారా రూ.20 లక్షల ఆదాయం లభించింది. కాగా గత […]
Buggana Rajendranath: ఏపీలో వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో వివిధ బ్యాంకులు అందిస్తున్న తోడ్పాటు అభినందనీయమని ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలోని ఐదో బ్లాకు కలెక్టర్ల సమావేశ మందిరంలో మంగళవారం రాష్ట్ర స్థాయి బ్యాంకరుల కమిటీ (SLBC) 220వ సమావేశం మంత్రి బుగ్గన అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళిక(ఏసీపీ)అమలులో వివిధ బ్యాంకులు సాధించిన ప్రగతి, వివిధ ఇండికేటర్ల […]
IND Vs SA: వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా ఓడిపోయింది. ఢిల్లీ వేదికగా జరిగిన కీలకమైన మూడో వన్డేలో దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. 100 పరుగుల లక్ష్యాన్ని కేవలం 19.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 8 పరుగులు చేసి రనౌట్‌గా వెనుతిరగ్గా.. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 49 పరుగులకు అవుటయ్యాడు. గత […]