2021 సంవత్సరానికి క్రీడా రంగంలో అందించే ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న, అర్జున అవార్డులకు ఎంపికైన ఆటగాళ్ల జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది ఖేల్‌రత్న పురస్కారానికి ఎంపిక కాగా 35 మందిని అర్జున అవార్డు వరించింది. ఖేల్‌రత్న పురస్కారానికి ఎంపికైన వారిలో టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా (జావెలిన్), మిథాలీ రాజ్ (క్రికెట్), రవి దహియా (రెజ్లింగ్), లవ్లీనా (బాక్సింగ్), అవని లేఖ (పారా షూటింగ్), సునీల్ […]
ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న సామాన్యులకు మరో షాక్ తగలనుంది. రికార్డు స్థాయికి చేరిన వంట గ్యాస్ ధరను చమురు సంస్థలు మరోసారి పెంచేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీపావళికి ముందే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు 60 శాతం పెరగడంతో.. దేశీయంగా గ్యాస్ సిలిండర్ ధర మరో రూ.100 వరకు పెరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే ధరలు పెరగాల్సి ఉన్నా కేంద్ర ప్రభుత్వ అనుమతి […]
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తమిళ మూవీ ‘అన్నాత్తె’ తెలుగులో ‘పెద్దన్న’గా రాబోతోంది. ఈ మేరకు బుధవారం చిత్ర యూనిట్ పెద్దన్న మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఈ చిత్రంలో హీరో రజనీకాంత్‌కు చెల్లెలి పాత్రలో మహానటి ఫేం కీర్తి సురేష్ నటించింది. మరోవైపు నయనతార, మీనా, ఖుష్బూ వంటి నటీమణులు కీలక పాత్రలను పోషించారు. Read Also: తమన్నా పరువు అడ్డంగా తీసిన ‘మాస్టర్ చెఫ్’ యాజమాన్యం ‘నువ్వు […]
బిగ్‌బాస్ హౌస్‌లో 8వ వారం కెప్టెన్ అయ్యేందుకు కంటెస్టెంట్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ వారం కెప్టెన్సీ బరిలో ఉండేందుకు బిగ్‌బాస్ ఐదుగురికి మాత్రమే అవకాశం ఇచ్చాడు. దీని కోసం ఐదు టాస్కులను కంటెస్టెంట్ల ముందు ఉంచాడు. మట్టిలో ముత్యాలు అనే మొదటి టాస్కులో లోబో, షణ్ముఖ్ పోటీ పడగా షణ్ముఖ్ గెలిచాడు. రెండోది ఫోకస్ టాస్క్. ఈ టాస్కులో రవి, సిరి పోటీ పడగా సిరి గెలిచింది. మూడోది ఫిజికల్ టాస్క్. ఈ టాస్కులో శ్రీరామ్, […]
సెల్‌ఫోన్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. రిలయన్స్ జియో-గూగుల్ కలిసి రూపొందిస్తున్న జియో ఫోన్ ‘నెక్స్ట్’ లాంచింగ్ డేట్ అధికారికంగా ఖరారైంది. ఈ ఫోన్‌ను దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదల చేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో కొత్తగా స్మార్ట్‌ఫోన్లకు అలవాటు పడిన వారి సంఖ్య బాగా పెరిగిందని అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ భాషలు మాట్లాడే వారికి కూడా అందుబాటు ధరలో ఫోన్‌ను తీసుకురావడం ఆనందంగా […]
టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-1లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 124/9 స్కోరు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా బ్యాట్స్‌మెన్‌లో ముష్ఫీకర్ రహీమ్ (29), మహ్మదుల్లా (19), నసమ్ అహ్మద్ (19), నూరుల్ హసన్ (16), మెహిదీ హసన్ (11) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. టైమల్ మిల్స్ 3 వికెట్లు, […]
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు వారం రోజుల క్రితం మొదలు పెట్టిన బూతు డ్రామాకు నిన్న తెర దించారని సజ్జల వ్యాఖ్యానించారు. ఏపీలో సంక్షేమ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ఈ డ్రామాకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. అబద్దాలు, డ్రామాలు, విధానాలను అలవోకగా మార్చడం చంద్రబాబు తెలిసిన ఏకైక విద్య అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసే […]
నందమూరి బాలకృష్ణ త్వరలోనే ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆహా ఓటీటీ ద్వారా అన్‌స్టాపబుల్ అనే టాక్ షో ద్వారా ఆయన హోస్ట్ అవతారంలో కనిపించనున్నాడు. తాజాగా ఈ షోకు సంబంధించి ప్రోమో విడుదల చేయగా.. అందులో యాంకర్‌గా బాలయ్య ఆకట్టుకుంటున్నాడు. ఈ ప్రోమోలో ‘నీకు చిత్తశుద్ధి ఉన్నప్పుడు.. నీకు లక్ష్య సిద్ధి ఉన్నప్పుడు.. నీకు సంకల్ప సిద్ధి ఉన్నప్పుడు నిన్ను పంచభూతాలు ఆపలేవు.. మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాపింగ్ ఉండదు.. సై అంటే సై…. నై […]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో పలువురు జోనల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. అయితే ఈ బదిలీల్లో ట్విస్ట్ చోటుచేసుకుంది. కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మమత మరోసారి తన స్థానాన్ని వదులుకునేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. కూకట్‌పల్లిని వీడేందుకు మమత విముఖత చూపారు. దీంతో ఆమెను కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గానే కొనసాగిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. Read Also: రెండు రోజుల పాటు నీటి సరఫరా […]
హైదరాబాద్ మెట్రో రైలులో ఓ గర్భిణీ మహిళ కింద కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మెట్రో రైలులో ప్రయాణించే వారికి కనీసం మానవత్వం లేదా అనే కామెంట్లను పెడుతున్నారు. మనిషి అన్న తర్వాత ఇతరుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని కోరుతున్నారు. అయితే ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఆర్టీసీ బస్సుల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకునే అవకాశమే లేదని ఓ ట్వీట్ ద్వారా ఆయన స్పష్టం చేశారు. Read Also: షర్మిల […]