బిగ్‌బాస్-5: పోటీలో ఆరుగురు… ఈ వారం కెప్టెన్ ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్‌బాస్ హౌస్‌లో 8వ వారం కెప్టెన్ అయ్యేందుకు కంటెస్టెంట్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ వారం కెప్టెన్సీ బరిలో ఉండేందుకు బిగ్‌బాస్ ఐదుగురికి మాత్రమే అవకాశం ఇచ్చాడు. దీని కోసం ఐదు టాస్కులను కంటెస్టెంట్ల ముందు ఉంచాడు. మట్టిలో ముత్యాలు అనే మొదటి టాస్కులో లోబో, షణ్ముఖ్ పోటీ పడగా షణ్ముఖ్ గెలిచాడు. రెండోది ఫోకస్ టాస్క్. ఈ టాస్కులో రవి, సిరి పోటీ పడగా సిరి గెలిచింది. మూడోది ఫిజికల్ టాస్క్. ఈ టాస్కులో శ్రీరామ్, మానస్ పోటీ పడగా శ్రీరామ్ విజయం సాధించాడు. ఈ మూడు టాస్కులు మంగళవారం ముగిశాయి.
Read Also: బిగ్ బాస్ 5 : ప్రియాకు షాకింగ్ రెమ్యూనరేషన్?
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
ఇక నాలుగో టాస్క్ బుధవారం జరగనుంది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ‘రంగు పడుద్ది’ అనే టాస్కును బిగ్‌బాస్ ఇచ్చినట్లు ప్రోమోను చూస్తే అర్థమవుతుంది. ఇందులో యానీ మాస్టర్, ప్రియాంక పోటీ పడగా యానీ మాస్టర్ గెలిచినట్లు సమాచారం. ఐదో ఛాలెంజ్‌లో భాగంగా ఎవరు పాల్గొనాలనే విషయంపై హౌస్‌లో చర్చోపచర్చలు జరిగాయి. జెస్సీ మరోసారి కెప్టెన్ అవ్వాలని ప్రయత్నించగా… హౌస్‌లో ఎవరూ మద్దతు ఇవ్వకపోవడంతో అతడు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఐదో ఛాలెంజ్‌లో మానస్ విజయం సాధించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సన్నీకి బిగ్‌బాస్ ఇచ్చిన పవర్ ప్రకారం అతడు కూడా కెప్టెన్సీ టాస్కులో పోటీ పడుతున్నాడు. దీంతో ఈ వారం కెప్టెన్ పదవి కోసం ఆరుగురు పోటీ పడుతున్నారు. షణ్ముఖ్, శ్రీరామ్, సిరి, యానీ, మానస్, సన్నీలలో కెప్టెన్ ఎవరు అవుతారో బుధవారం ఎపిసోడ్‌లో తేలనుంది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!