BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్ పీవీ సింధు సత్తా చాటుతోంది. ఈ మేరకు గురువారం జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన పోర్న్‌పావీ చొచువాంగ్‌ను 21-14, 21-18 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 48 నిమిషాల పాటు జరిగిన రౌండ్-3 మ్యాచ్‌లో విజయం సాధించడంతో పీవీ సింధు క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. తదుపరి పోరులో తైవాన్ క్రీడాకారిణి తై జు యింగ్‌తో పీవీ సింధు తలపడనుంది. Read Also: కోహ్లీ చేసింది మంచి పని కాదు: […]
ఏపీలో సినిమా టిక్కెట్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. రేపు ‘పుష్ప’ సినిమా విడుదల నేపథ్యంలో టిక్కెట్ల రేట్ల విషయంలో గందరగోళం నెలకొంది. గతంలో ఉన్న కమిటీలో లోటు పాట్లను సరిచేసి కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు చేసిన విషయం తెలిసిందే. టిక్కెట్ల ధరల జాబితాను జాయింట్ కలెక్టర్‌కు పంపించాలని థియేటర్ యజమానులకు కూడా హైకోర్టు సూచించింది. టిక్కెట్ల ధరలకు అనుగుణంగా పన్నులు చెల్లించాలని కూడా హితవు పలికింది. […]
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన స్వరం మార్చారు. ఇటీవల రాహుల్ ప్రధాని కాలేరని వ్యాఖ్యానించిన ప్రశాంత్ కిషోర్… తాజాగా తన మాట మార్చుకుని రాహుల్ ప్రధాని అయ్యే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలో అధికారం చేపట్టడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. గాంధీ పరివారం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించగలదని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ చేసిన తాజా వ్యాఖ్యలు […]
జెమినీ టీవీలో ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ముగిసింది. గతంలో చిరంజీవి, నాగార్జున హోస్ట్ చేసిన షోలు స్టార్ మాటీవీలో ప్రసారం కాగా.. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన షో మాత్రం జెమినీ టీవీలో టెలీకాస్ట్ చేశారు. అయితే ఈ షోకు భారీ టీఆర్పీలు వస్తాయని నిర్వాహకులు ఆశించారు. కానీ ప్రారంభంలో ఆశలు రేకెత్తించిన టీఆర్పీలు రాను రాను తీసికట్టుగా వచ్చాయి. ఈ నేపథ్యంలో సీజన్ చివరి ఎపిసోడ్‌కు ఏకంగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు […]
తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. లోక్‌సభలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు స్పందిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర జలశక్తి సలహా మండలి అనుమతి ఉందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వమే సొంత వనరులతో ఈ ప్రాజెక్టును నిర్మించిందని…. ఇప్పటివరకు 83.7 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని కేంద్రం ప్రకటించింది. Read Also: ఎన్నికల […]
మెట్రో మ్యాన్ శ్రీధరన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు శ్రీధరన్ ప్రకటించారు. తనకు తత్వం బోధపడిందని.. ఎన్నికల్లో పోటీ చేసి తగిన గుణపాఠం నేర్చుకున్నానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తనకు 90 ఏళ్లు అని… ఇంకా రాజకీయాల్లో ఉండటం, రాజకీయంగా కెరీర్ కొనసాగిస్తే మరింత ప్రమాదంలో పడతానని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ నేతగా ఉండటం తనకు ఇష్టం లేదని.. రాజకీయాలను చేయడం తన డ్రీమ్ కూడా కాదని శ్రీధరన్ స్పష్టం చేశారు. Read Also: […]
టీడీపీ మాజీ మంత్రి, కర్నూలు జిల్లా నాయకురాలు భూమా అఖిలప్రియ గురువారం నాడు మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు భూమా అఖిలప్రియ తన బిడ్డతో ఉన్న ఫోటోను షేర్ చేశారు. భూమా అఖిల ప్రియ తన తల్లి శోభానాగిరెడ్డి జయంతి రోజునే మగబిడ్డకు జన్మనివ్వడం గమనార్హం. Read Also: ఏపీ పాలనా రాజధానిపై మంత్రి కీలక వ్యాఖ్యలు తల్లి శోభానాగిరెడ్డి మరణంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన […]
కరోనా వైరస్ కారణంగా తెలంగాణలో గత ఏడాది రద్దయిన ఫస్టియర్ పరీక్షలను అధికారులు ఇటీవల నిర్వహించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను నిర్వహించగా… ఆ ఫలితాలను ఈరోజు విడుదల చేశారు. మొత్తం 4.59 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాయగా 49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంటర్ ఫలితాలను చెక్ చేసుకునేందుకు tsbie.cgg.gov.in లేదా manabadi.com వెబ్‌సైట్లను సందర్శించవచ్చు. […]
బిగ్‌బాస్-5 కంటెస్టెంట్, బుల్లితెర ప్రముఖ యాంకర్ రవి పోలీసులను ఆశ్రయించాడు. తనపై, తన కుటుంబ సభ్యులపై కొందరు అసభ్య కామెంట్లు చేస్తున్నారని ఆరోపిస్తూ యాంకర్ రవి హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాలో తనపై అనుచిత కామెంట్లు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తనపై ఎన్ని కామెంట్లు చేసినా పట్టించుకునేవాడిని కాదని.. కానీ తన కుటుంబసభ్యులపై అసభ్యంగా కామెంట్లు పెడుతున్నారని యాంకర్ రవి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. Read Also: హ్యాట్సాఫ్.. మానవత్వం […]
కరోనా పుణ్యమా అని ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. సినిమా థియేటర్లు తెరిచినా ఓటీటీలు ఉన్నాయి కదా అని చాలా మంది వెళ్లడం లేదు. దీంతో పలు ఓటీటీ సంస్థలు ఛార్జీలు పెంచే పనిలో పడ్డాయి. తాజాగా అమెజాన్ సంస్థ ప్రైమ్ మెంబర్‌షిప్ ఛార్జీలు భారీగా పెంచింది. ఈరోజు అర్ధరాత్రి నుంచే పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఓటీటీ ప్రియులకు ఓ వైపు అమెజాన్ షాక్ ఇవ్వగా.. నెట్‌ఫ్లిక్స్ ఇండియా మాత్రం గుడ్‌న్యూస్ చెప్పింది. Read Also: గుడ్‌న్యూస్ చెప్పిన […]