ఈరోజుల్లో పబ్లిసిటీలో కొత్త పుంతలు కనిపిస్తేనే కస్టమర్లను ఆకట్టుకునే అవకాశాలు ఉంటాయి. అంతేకానీ పాతచింతకాయ పచ్చడిలా ప్రకటనలు ఇస్తే చూస్తే రోజులు పోయాయి. అందుకే వ్యాపార సంస్థలు ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి. తమ బ్రాండ్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఎంతకైనా తెగిస్తున్నాయి. అమూల్ సంస్థ ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివినట్లు కనిపిస్తోంది. ఇటీవల కోక్ ఇష్యూను తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం వాడుకున్న అమూల్.. ఇప్పుడు ఏకంగా ఓ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీని తమ బ్రాండ్ కోసం వాడేసుకుంది.
Read Also: ‘అనగనగా ఒక రాజు’గా మారిన ‘జాతిరత్నం’
వివరాల్లోకి వెళ్తే… టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప-దిరైజ్’ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిన విషయమే. ఈ మూవీ అన్ని భాషల్లోనూ మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో అల్లు అర్జున్‌కు హిందీలోనూ బీభత్సమైన క్రేజ్ వచ్చేసింది. అందుకే ఇప్పుడు అమూల్ తన బ్రాండ్ కోసం పుష్ప రాజ్, శ్రీవల్లి క్యారెక్టర్లను వాడేసుకుంది. ‘పుష్పక్ ది స్లైస్’.. అమూల్ హేవ్ సమ్ అమ్ములు, అర్జున్’ అంటూ పుష్ప రాజ్, శ్రీవల్లి క్యారెక్టర్లతో డిజైన్ చేసిన కార్టూన్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అమూల్ ఐడియా అదిరిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
#Amul Topical: New action drama film is a huge hit! pic.twitter.com/dO3M58lfne
— Amul.coop (@Amul_Coop) January 16, 2022