Naga Babu: పొత్తులపై నాగబాబు కీలక వ్యాఖ్యలు.. వైసీపీ నేతల్లా దిగజారి మాట్లాడలేం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Babu: జనసేన నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో ఆయన ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఎన్నికల్లో పొత్తులు లేకుండా ఉంటే అన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అయినా పొత్తులపై నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ కళ్యాణ్ చెప్పడం వెనుక ఏదో వ్యూహం ఉందని నాగబాబు అన్నారు. వైసీపీ విమర్శ అనేది దాటిపోయి తిట్టడం అనే కొత్త సంస్కృతి తెచ్చిందన్నారు. పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా విమర్శించొచ్చని.. కానీ వైసీపీలా దిగజారి తాము మాట్లాడలేమన్నారు. పవన్ కళ్యాణ్‌ను సీఎం చేయడమే తమ లక్ష్యమన్నారు. లైం లైట్‌లోకి రావడానికి తమను విమర్శిస్తున్నారని.. వారికి ఉపయోగపడుతుందంటే తిట్టనివ్వండి అంటూ నాగబాబు వ్యాఖ్యానించారు. తాము ప్రజలకు సేవ చేసే కృషిలో ఉన్నామన్నారు.
Read Also: NVSS Prabhakar: కేసీఆర్ కళ్లకి అద్దాలు పెట్టించి.. మోడీ అభివృద్ధిని చూపించాలి..
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
సింహం సింగిల్ వస్తుందనే సినిమా డైలాగులకు తాము స్పందించాల్సిన అవసరం లేదని నాగబాబు అన్నారు. జర్మనీని ఓడించడానికి అమెరికా , రష్యా వంటి దేశాలు కలిశాయని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము కూడా ఇతరులతో కలవాల్సి వస్తోందన్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది సస్పెన్స్ అన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయను.. పార్టీని పటిష్టం చేయడానికి పని చేస్తానని నాగబాబు చెప్పారు. 2019లో 7 శాతం ఓట్లు వచ్చిన జనసేన ఇప్పుడు 24 శాతానికి పెరిగిందని.. రాబోయే రోజుల్లో 40 శాతం వరకు పెరగొచ్చని అంచనా వేశారు. సంస్థాగత నిర్మాణం లేకపోవడం వల్ల జనసేనపై జనంలో అభిమానం, నమ్మకం ఉండదన్నది నిజం కాదని.. స్థాగత నిర్మాణం ఉన్న కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ కూడా ఎన్నికల్లో ఓడిపోయాయని నాగబాబు గుర్తుచేశారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!