Andhra Pradesh: ఏపీకి కేంద్రం శుభవార్త.. ఏడు నూతన ఈఎస్‌ఐ ఆస్పత్రులు మంజూరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రానికి ఏడు నూతన ఈఎస్‌ఐ ఆస్పత్రులను మంజూరు చేసింది. సోమవారం నాడు పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కొత్త ఈఎస్‌ఐ ఆస్పత్రుల వివరాల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించగా ఈ విషయాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విశాఖలో రూ.384.26 కోట్లతో సీపీడబ్ల్యూడీ శాఖతో నూతన ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మితం అవుతుందని.. విజయనగరంలో రూ.73.68 కోట్ల కేంద్ర నిధులతో MECON కంపెనీ ఆధ్వర్యంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మితం అవుతుందని.. కాకినాడలో రూ.102.77 కోట్ల కేంద్ర నిధుల కేటాయింపుతో సీపీడబ్ల్యూడీ శాఖ సహకారంతో కొత్త ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణం జరుగుతుందని కేంద్రం వెల్లడించింది.
మరోవైపు గుంటూరు, పెనుకొండ, విశాఖ, అచ్యుతాపురం, నెల్లూరు శ్రీ సిటీలకు నూతన ఈఎస్ఐ ఆసుపత్రులు మంజూరు చేశామని.. అయితే అవి ఇంకా భూసేకరణ దశలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వివరించింది. ఏపీలో ఇంకా పునర్నిర్మాణంలో మూడు ప్రధాన ఈఎస్‌ఐ ఆసుపత్రులు ఉన్నాయంది. రాజమండ్రిలో 2020, ఆగస్టు 19న రూ.97.97 కోట్లు కేటాయించబడి ఇప్పటివరకు 10.90 కోట్ల నిధుల విడుదలతో సీపీడబ్ల్యూడీ శాఖ ఆధ్వర్యంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి పునర్నిర్మాణంలో ఉందని కేంద్రం తెలిపింది. విశాఖ జిల్లా మల్కీపురంలో 2019, నవంబర్ 13న రూ.79 కోట్ల కేటాయింపుతో ఇప్పటివరకు రూ.19.16 కోట్ల నిధుల విడుదలతో సీపీడబ్ల్యూడీ శాఖ ఆధ్వర్యంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి పునర్నిర్మాణంలో ఉందని.. విజయవాడలో కూడా సీపీడబ్ల్యూడీ శాఖకు ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం బాధ్యతలు అప్పజెప్పడం జరిగిందని కేంద్రం తెలియజేసింది.
Also Read
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
కాగా ఆరోగ్య వసతుల లేమితో బాధపడుతున్న ఏపీ ప్రజలకు కేంద్రం మంజూరు చేసిన ఈఎస్‌ఐ ఆస్పత్రుల వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..