PAN Aadhaar link: మార్చి 31 డెడ్‌లైన్.. లేకపోతే రూ.10వేలు జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుకోవాలంటే పాన్‌కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయించడం తప్పనిసరి. అయితే ఇంకా చాలా మంది పాన్-ఆధార్ లింక్ ప్రక్రియను పూర్తి చేయలేదు. ముఖ్యంగా పన్ను కట్టే వ్యాపారులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ పాన్, ఆధార్ లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాంటి వారు మార్చి 31 లోపు ఆధార్, పాన్ కార్డును లింక్ చేసుకోవాలని కేంద్రం సూచించింది.
కరోనా కారణంగా ఆధార్, పాన్ లింక్ గడువు తేదీని ఈ ఏడాది మార్చి 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) పొడిగించింది. అయితే.. ఈసారి మాత్రం ఇక గడువును పొడిగించేది లేదని సీబీడీటీ స్పష్టం చేసింది. మార్చి 31 లోపు ఆధార్, పాన్‌ను లింక్ చేసుకోకపోతే రూ.10 వేల జరిమానా విధిస్తామని సీబీడీటీ హెచ్చరించింది. పాన్, ఆధార్ లింక్ చేయడం కోసం www.incometaxindiaefiling.gov.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి లింక్ ఆధార్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, పూర్తి పేరు, ఇతర వివరాలు అందించాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి.. లింక్ ఆధార్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. అనంతరం 10 రోజుల్లో ఆధార్, పాన్ కార్డు లింకింగ్ పూర్తవుతుంది.
Also Read
- Sanjay Malhotra: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశానికి ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
- RBI New Rules 2026: రుణ ఎగవేతదారులకు ఆర్బీఐ భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- RBI Rule: బ్యాంక్ పొరపాటు వల్ల మీకు నష్టం జరిగిందా..? రూ.33 లక్షల పరిహారం పొందండిలా..
తాజావార్తలు
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్‌చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?