Andhra Pradesh: మళ్లీ టీడీపీ గూటికి చేరనున్న మాజీ మంత్రి రావెల?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి, బీజేపీ నేత రావెల కిషోర్‌బాబు తిరిగి టీడీపీ గూటికి చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. గుంటూరులో మంగళవారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబును రావెల కిషోర్‌బాబు కలిసి మంతనాలు జరిపారు. దీంతో ఆయన టీడీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసి రావెల ఓటమి పాలయ్యారు. ఎన్నికల తర్వాత రావెల జనసేనకు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. అయితే కొంతకాలంగా ఆయన మళ్లీ టీడీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబును రావెల కలవడంతో ఈ వార్తలకు బలం చేకూరింది.
కాగా గతంలో రావెల కిషోర్ బాబు ఐఆర్‌ఎస్ అధికారిగా పనిచేశారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలవడంతో అనూహ్యంగా మంత్రి పదవి కూడా దక్కింది. సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే వరుస వివాదాల కారణంగా 2018లో కేబినెట్ విస్తరణలో ఆయన మంత్రి పదవి పోయింది. దీంతో అసంతృప్తి చెందిన ఆయన.. టీడీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన సంగతి తెలిసిందే.
Also Read
- RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
తాజావార్తలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!