జూన్ 1 నుంచి జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 1న శ్రీకాకుళం జిల్లా, జూన్ 2న విజయనగరం జిల్లా, జూన్ 3న విశాఖ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో నాగబాబు పర్యటిస్తారని జనసేన పార్టీ వెల్లడించింది. ఈ పర్యటనలో మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలోని జనసేన పార్టీ ముఖ్య నాయకులకు, జిల్లా కమిటీ నాయకులకు, నియోజకవర్గ కమిటీ నాయకులకు, ఆయా విభాగాల కమిటీ నాయకులకు, వీర మహిళలకు నాగబాబు అందుబాటులో ఉంటారని జనసేన అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ వెల్లడించారు.
ఉత్తరాంధ్ర పర్యటనలో నాగబాబు ముఖ్యమైన సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులకు భవిష్యత్ కార్యకలాపాలపై దిశా నిర్దేశం చేయాలని పవన్ కళ్యాణ్ సూచించినట్లు హరిప్రసాద్ తెలిపారు. పార్టీ ఎదుగుదలకు దోహదపడే అంశాలను నాగబాబు స్వీకరిస్తారని పేర్కొన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, విధానాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న పలువురు నాయకులను నాగబాబు పార్టీలోకి ఆహ్వానిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర పర్యటనలో నాగబాబుకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేయాలని హరిప్రసాద్ సూచించారు.
జూన్ 1 నుండి నాగబాబు గారు ఉత్తరాంధ్ర పర్యటన.. pic.twitter.com/WAHVozSuyS
— JanaSena Party (@JanaSenaParty) May 29, 2022