అక్కినేని యంగ్ హీరో సుశాంత్ నటించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. మీనాక్షి చౌదరి నాయిక. ఎస్.దర్శన్ దర్శకత్వం వహించారు. రవి శంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికేట్ పొందింది. ‘వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా ఇది. వైవిధ్యమైన థ్రిల్లర్‌గా ప్రేక్షకుల మనసుల్ని గెలుస్తుంది’ని దర్శకనిర్మాతలు చెప్పుకొస్తున్నారు. వెన్నెల కిషోర్, ప్రియదర్శి, వెంకట్ కీలక పాత్రల్లో నటించారు. రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల నిర్మాతలు. ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్ని అందించారు. కాగా, చాలా రోజుల నుంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తోన్న సుశాంత్ కు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.