అప్పుడు భూమిక… ఇప్పుడు పూజ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్ర విచిత్రమైన సంఘటనలకు మన సినిమా పరిశ్రమ వేదిక అవుతూ ఉంటుంది. అలాంటి సంఘటనలు తలచుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. తాజాగా అలాంటి యాదృచ్చికమైన విషయాన్ని గుర్తు చేసుకుందాం. ఈ సంఘటనకు కారకులు భూమిక, పూజాహేగ్డే కావటం విశేషం.
2000లో ‘యువకుడు’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింద భూమిక. ఆ తర్వాత ఏడాదే పవన్ కళ్యాణ్ తో ‘ఖుషీ’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవటంతో భూమికకు వెనుదిరిగి చూసుకునే అవసరం లేకపోయింది. అయితే ‘ఖుషీ’ పవన్ కి 7వ సినిమా. ఆ తర్వాత 2003లో మహేశ్ బాబుతో ‘ఒక్కడు’, ఎన్టీఆర్ తో ‘సింహాద్రి’ సినిమాల్లోనూ హీరోయిన్ గా నటించింది భూమిక. ఆ సినిమాలు మహేశ్, ఎన్టీఆర్ కి 7వ సినిమాలు కావటం అవి రెండు కూడా సూపర్ డూపర్ హిట్ కావటం గమనార్హం. ఇలా ముగ్గురు హీరోల 7వ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కావటం… అందులో భూమిక హీరోయిన్ కావటమే అసలు సిసలు ట్విస్ట్.
Also Read
- Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
- LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
ఇక ప్రస్తుతానికి వస్తే 2014లో ‘ఒక లైలా కోసం’ సినిమాలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది పూజా హేగ్డే. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ తెలుగునాట స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది. 2018లో ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలో నాయికగా నటించటం… అది హిట్ కావటం జరిగింది. ఈ సినిమా హీరోగా ఎన్టీఆర్ కి 28వ చిత్రం. గత ఏడాది ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘అల వైకుంఠపురం’లోనూ పూజనే హీరోయిన్. ప్రస్తుతం ‘రాధేశ్యామ్, ఆచార్య’ వంటి సినిమాలో పాటు తమిళంలో ‘బీస్ట్’, బాలీవుడ్ లో ‘సర్కస్, భాయిజాన్’ సినిమాల్లో నటిస్తోంది. వాటితో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించే సినిమాలోనూ, హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించే సినిమాలోనూ పూజనే హీరోయిన్ గా కన్ ఫామ్ చేశారు. ఈ రెండు సినిమాలు మహేశ్, పవన్ కళ్యాణ్ కి 28వ సినిమాలు కావటం విశేషం. సో అప్పట్లో ఈ ముగ్గురు హీరోల 7వ సినిమాలో భూమిక హీరోయిన్ కాగా… ఇప్పుడు 28వ సినిమాలో పూజా హేగ్డే కథానాయిక. అప్పుడు భూమిక నటించిన ఈ ముగ్గురు హీరోల సినిమా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు పూజ నటించిన ఎన్టీఆర్ 28వ సినిమా ‘అరవింద సమేత’ ఘనవిజయం సాధించింది. సెంటిమెంట్ గా మహేశ్, పవన్ సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతాయేమో చూద్దాం.
తాజావార్తలు
-
Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
-
IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
-
LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
TDP Candidates 1st List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ తొలి జాబితా.. 61 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు
ట్రెండింగ్
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!