సెప్టెంబర్ 2న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 50వ పుట్టినరోజు జరుపుకొన్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ మూడు రోజుల ముందు నుంచే అభిమాన సంఘాలను, ఫ్యాన్స్ గ్రూపులను అలెర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే బుల్లితెర కూడా పలు షోలతో పవన్ కళ్యాణ్ కు అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నాయి. అయితే ఈసారి పవన్ 50వ బర్త్ కావడంతో ఫ్యాన్స్ మరింత గట్టిగా ప్లాన్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలోనూ ఇండియా వైడ్ గా పవన్ కళ్యాణ్ ట్రెండ్ అయ్యేలా ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. అందుకు ట్విట్టర్ ను వేదికగా మార్చుకోనున్నారు. కామన్ గా పవన్ కళ్యాణ్ ట్యాగ్ ప్రతిసారి ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఆయన నుంచి ఏ వార్త లేకున్నాను.. ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తూనే వుంటారు. అయితే ఈసారి మాత్రం చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అభిమానులు పలు సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ఇక పవన్ సినిమాల నుంచి కూడా అప్డేట్స్ రానున్నాయి. దీంతో అభిమానుల్లో మరింత జోష్ కనిపించనుంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘భీమ్లా నాయక్’, ‘హరి హర వీరమల్లు’ నుంచి అప్డేట్స్ రానుండగా.. హరీష్ శంకర్ – పవన్ సినిమా నుంచి కూడా సర్ ప్రైజ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే సురేందర్ రెడ్డితోనూ సినిమా ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.