హీరో గోపీచంద్, కమర్షియల్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది కాంబోలో వస్తున్న రెండవ చిత్రం ‘సీటీమార్’.. గోపీచంద్ కు జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. భూమిక చావ్లా, దిగంగన సూర్యవంశీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 10న ఈ చిత్రం థియేటర్స్ లోకి రానుంది. ఈ నేపథ్యంలో ‘సీటీమార్’ ట్రైలర్ విడుదల చేశారు. గోపీచంద్ ఆంధ్ర కోచ్ గా, తమన్నా తెలంగాణ కోచ్ […]
లండన్‌లో దాదాపు రెండు రోజుల పదమూడు గంటల పాటు సంగీతంలోని ఎంతో విశిష్టమైన 72 మేళకర్త రాగాలను పలికించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వంటి అత్యున్నతమైన అవార్డును అందుకున్న ప్రముఖ సంగీత దర్శకులు స్వర వీణాపాణి. ‘పట్టుకోండి చూద్దాం’, ‘ దేవస్థానం’, ‘మిథునం’ వంటి చక్కని చిత్రాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు. ఆయన పెద్ద కుమార్తె మారుతీ సాయిలక్ష్మీ వివాహం భాను రాజీవ్‌తో సోమవారం రాత్రి హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఈ వివాహ […]
శ్రీకాంత్ కుమారుడు రోషన్ ఇప్పటికే బాల నటుడిగానే కాకుండా యువ కథానాయకుడిగానూ ‘నిర్మలా కాన్వెంట్’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాస్తంత గ్యాప్ తీసుకుని సెప్టెంబర్ మాసంలో ‘పెళ్ళి సందడి’తో మరోసారి హీరోగా సందడి చేయబోతున్నాడు. విశేషం ఏమంటే… శ్రీకాంత్, ఊహ కుమార్తె మేథ సైతం త్వరలో పూర్తి స్థాయిలో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతోందట. గతంలో గుణశేఖర్ రూపొందించిన ‘రుద్రమదేవి’ చిత్రంలో బాలరుద్రమగా శ్రీకాంత్ కూతురు మేథ నటించింది. ఆ సినిమాలో రోషన్ చిన్నప్పటి రానా […]
బాలకృష్ణ, బోయపాటి కలయికలో వస్తున్న మూడో సినిమా ‘అఖండ’. బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. మొదటి రెండు సినిమాలు ‘సింహా’, ‘లెజెండ్’ ఒకదానిని మించి మరోటి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ‘అఖండ’పై ఆడియన్స్ లోనూ భారీ అంచనాలున్నాయి. దానికి తగినట్లే బోయపాటి ఎంతో పట్టుదలతో ‘అఖండ’ను ఎలాగైన హిట్ చేయాలని కంకణం కట్టుకున్నాడట. తాజా సమాచారం ప్రకటారం ఈ సినిమాలో మొత్తం ఎనిమిది ఫైట్స్ ఉంటాయట. అందులో ప్రత్యకంగా ఇంటర్వెల్ […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషించిన సినిమా ‘తలైవి’. పురచ్చి తలైవి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఎ. ఎల్. విజయ్ దర్శకత్వంలో విబ్రి మీడియా, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా సెప్టెంబర్ 10న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా తమిళ వర్షన్ సెన్సార్ కార్యక్రమాలు జూన్ 22న పూర్తయ్యాయి. తాజాగా హిందీ వర్షన్ సెన్సార్ సైతం పూర్తయింది. తమిళంలో […]
తమిళనాట దర్శకుడు బాలాకి మంచి క్రేజ్ ఉంది. వివాదాస్పద అంశాలతో హార్డ్ హిట్టింగ్ సినిమాలను చేస్తుంటాడు బాల. అందుకే స్టార్స్ కూడా తన సినిమాలో నటించటానికి ఆసక్తి చూపిస్తుంటారు. బాల చివరగా జ్యోతిక నటించిన 2018 థ్రిల్లర్ డ్రామా ‘నాచియార్’ ను తెరకెక్కించాడు. ఆ తర్వాత విక్రమ్ కుమారుడు తో చేసిన ‘వర్మ’ సినిమా నచ్చలేదని వేరే దర్శకుడుతో రీ-షూట్ చేసి విడుదల చేశారు. ప్రస్తుతం బాల మలయాళ ‘జోసెఫ్’ ఆధారంగా ‘విశిథిరన్’ అనే సినిమాను పద్మకుమార్ […]
(ఆగస్టు 30తో ‘మామగారు’కు 30 ఏళ్ళు పూర్తి) నటునిగానూ దర్శకరత్న దాసరి నారాయణరావు విశ్వరూపం చూపించిన చిత్రం ‘మామగారు’. తమిళ చిత్రం ‘నాన్ పుడిచ మాప్పిళ్ళై’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రీమేక్ మూవీస్ రూపొందించడంలో మేటి అనిపించుకున్నఎడిటర్ మోహన్ ఈ చిత్రాన్ని ఎమ్.ఎమ్.మూవీ ఆర్ట్స్ పతాకంపై నిర్మించారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. ఆ తరువాత మరో ఐదేళ్ళకు ఎడిటర్ మోహన్ నిర్మించిన రీమేక్ ‘హిట్లర్’లోనూ దాసరి కీలక పాత్ర పోషించగా, ఆ చిత్రానికి కూడా […]
(ఆగస్టు 30న రమేశ్ ప్రసాద్ పుట్టినరోజు) ఓ వైపు హైటెక్ సిటీ, మరో వైపు ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ భాగ్యనగరానికి మరింత శోభను తీసుకు వచ్చాయి. ప్రసాద్ సంస్థ తెలుగు చిత్రసీమలోనే కాదు భారతీయ చలనచిత్ర రంగంలోనే ఓ చరిత్ర సృష్టించింది. ఆ సంస్థ వ్యవస్థాపకులు మరెవరో కాదు ప్రఖ్యాత దర్శకనిర్మాత, నటుడు ఎల్.వి.ప్రసాద్. ఆయన నెలకొల్పిన ప్రసాద్ సంస్థలు అనేకం చిత్రసీమలో వేళ్లూనుకున్నాయి. హైదరాబాద్ లో ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్ విషయం అందరికీ తెలిసిందే. […]
(ఆగస్టు 30న శ్రీకృష్ణాష్టమి) తెలుగునాటనే కాదు యావద్భారతంలోనూ శ్రీకృష్ణ పాత్రలో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు యన్.టి.రామారావు ఖ్యాతి గాంచారు. ఆయన శ్రీకృష్ణ పాత్ర ధరించిన అనేక చిత్రాలు హిందీ, బెంగాలీ, మరాఠీ, ఒరియా భాషల్లోకి అనువాదమై అలరించాయి. ఉత్తరాదిన శ్రీకృష్ణ పాత్రకు అంతకు ముందు పెట్టింది పేరుగా నిలచిన షాహూ మోడక్ ను సైతం యన్టీఆర్ అభినయం మరిపించింది. యన్టీఆర్ తొలిసారి తెరపై శ్రీకృష్ణుని గెటప్ లో కనిపించిన చిత్రం ‘ఇద్దరు పెళ్ళాలు’. 1954లో ఎఫ్. గఫూర్ రూపొందించిన […]
(ఆగస్టు 30తో ‘సాజన్’కు 30 ఏళ్ళు పూర్తి) ప్రముఖ హిందీ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ లారెన్స్ డిసౌజా దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ హిట్ ‘సాజన్’. మాధురీ దీక్షిత్ నాయికగా తెరకెక్కిన ఈ చిత్రంలో సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ హీరోలుగా నటించారు. నదీమ్-శ్రవణ్ స్వరకల్పనలో రూపొందిన ‘సాజన్’ పాటలన్నీ ఎంతగానో అలరించాయి. ఈ చిత్రాన్ని సుధాకర్ బొకాడియా నిర్మించారు. 1991 ఆగస్టు 30న విడుదలైన ‘సాజన్’ ఆ యేడాది టాప్ గ్రాసర్ గా నిలచింది. ‘సాజన్’ కథలోకి తొంగి […]