గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గతేడాది వైరస్ బారిన పడి స్వర్గస్తులయ్యారు. 2020, ఆగస్టు 5 తేదీన కరోనా వ్యాధి బారినపడ్డ బాలు.. చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 25న కన్నుమూశారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాడిన వేలాది పాటలతో మనందరి హృదయాల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతాయని అభిమానులు ఆయన్ను స్మరించుకుంటున్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆయనను గుర్తు చేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ‘ఆ గాన గంధర్వుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను అంటూ ట్వీట్ […]
(సెప్టెంబర్ 24తో ‘గుడ్డి’ సినిమాకు 50 ఏళ్ళు) స్టార్ హీరోయిన్ గా, మహానటిగా పేరొంది, ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న జయాబచ్చన్ కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం ‘గుడ్డి’. 1971 సెప్టెంబర్ 24న విడుదలయిన ‘గుడ్డి’ చిత్రంలో మేచో హీరో ధర్మేంద్ర వీరాభిమానిగా జయబాధురి నటించారు. ఇందులో ‘గుడ్డి’ టైటిల్ రోల్ లో జయబాధురి అలరించిన తీరు భలేగా ఆకట్టుకుంది. ఈ సినిమా నగరాలలో ఘనవిజయం సాధించింది. ఇతర చోట్ల ఏవరేజ్ గా, ఎబౌ ఏవరేజ్ […]
(సెప్టెంబర్ 24న ‘ప్రేమమందిరం’కు 40 ఏళ్ళు) నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్ లో అనేక చిత్రాలు వెలుగు చూశాయి. వాటిలో అన్నిటికన్నా మిన్నగా నిలచింది ‘ప్రేమాభిషేకం’. ఈ చిత్రం విడుదలైన 1981లోనే అక్కినేని, దాసరి కాంబినేషన్ లో రూపొందిన మరో చిత్రం ‘ప్రేమ మందిరం’. ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత డి.రామానాయుడు నిర్మించడంతో ‘ప్రేమమందిరం’కు మొదటి నుంచీ ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది. అప్పటికే ‘ప్రేమాభిషేకం’ జైత్రయాత్ర కొనసాగుతోంది. అక్కినేని అభిమానుల […]
మౌంట్ ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన తెలంగాణ యువకుడు ఆంగోత్ తుకారాం ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను తుకారాం కలిశాడు. ఈ సందర్భంగా తుకారామ్‌ను ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. తుకారాం స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తక్కెల్లపల్లి.. . అతి పిన్న వయస్సులోనే 4 పర్వతాలు అధిరోహించటం అరుదైన సాహసంగా ఆంగోత్ తుకారాం పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘అంధదూన్’ రీసెంట్ గా తెలుగులో రీమేక్ అయినా సంగతి తెలిసిందే. నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈచిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇక ఈ సినిమా మలయాళంలో కూడా తెరకెక్కుతోంది. రవి కె.చంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు. కథానాయికగా రాశి ఖన్నా నటించింది. బాలీవుడ్ లో ‘టబు’ చేసిన పాత్రను మలయాళంలో మమతా మోహన్ దాస్ చేసింది. ఇక మమతా […]
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జీవిత ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ నటుడు పృథ్వీరాజ్ ఎన్నికల అధికారికి లేఖ రాయడంతో మరో వివాదం మొదలైంది. మా సభ్యులను జీవిత మభ్యపెడుతున్నారంటూ పృథ్వీ తన లేఖలో ఆరోపించారు. గతంలో జనరల్ సెక్రటరీ పదవిలో ఉన్న జీవిత, తనకు ఓట్లేస్తేనే ప్రయోజనాలు ఉంటాయని చెబుతోందని.. ఆమె నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ వెల్లడించారు. ఆమెపై క్రమశిక్షణ కమిటీ ద్వారా చర్యలు తీసుకోవాలని కోరారు. జీవిత మా ఎన్నికల్లో […]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు అక్టోబర్ 10న హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో జరుగనున్నాయి. ఆరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించి సాయంత్రం ఫలితాలను వెల్లడించనున్నారు. కాగా, గతంలో ఎన్నడూ లేనివిధంగా ‘మా’ అధ్యక్ష పదవిని దక్కంచుకునేందుకు సినీనటులు పోటీపడుతున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, హీరో మంచు విష్ణు, నటులు సీవీఎల్ నరసింహారావు, బండ్ల గణేష్ పోటీలో ఉన్నారు. అయితే ‘మా’ ఎలక్షన్ ప్రధానంగా ప్రకాశ్ […]
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా పరిణామాలు ఆసక్తిరేకిస్తున్నాయి. ఓ సినిమా కోసం రాంగోపాల్ వర్మ వరంగల్ జిల్లాలో సీక్రెట్ గా పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలువురి బయోపిక్ ల పేరుతో సంచలనం సృష్టించిన రాంగోపాల్ వర్మ, మరో బయోపిక్ తీయడానికి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో ఆయన వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ తాజాగా వరంగల్ లోని ఎల్బీ కళాశాలలో అధ్యాపకులను, సిబ్బందిని కలిసి కొంతసేపు రహస్యంగా చర్చించారు. ఎల్బీ కళాశాలకు సంబంధించిన […]